Uday kiran: లవ్ స్టోరీ చిత్రాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday kiran) నేడు మన మధ్య లేకపోయినా ఆయన చిత్రాలు మళ్లీ థియేటర్లలో విడుదల అవుతూ ఆయనను ఇంకా గుర్తు చేస్తున్నాయి. ఉదయ్ కిరణ్ నేడు మన మధ్య ఉండకపోవచ్చు కానీ ఆయన సినిమాలు ఎప్పుడు ఆయనను సజీవంగా మారుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అలా టాలీవుడ్ లో సున్నితమైన ప్రేమ కథలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ అభిమానులకు ఇప్పుడు అతిపెద్ద గుడ్ న్యూస్ వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చేసింది. సుమారుగా పాతికేళ్ల క్రితం ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’ ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అయ్యింది.
2021 లో విడుదలై ఘనవిజయం అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ 90స్ కిడ్స్ కి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ సినిమాను ఇష్టపడని ప్రేక్షకుడు దాదాపు లేరనే చెప్పాలి. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్ , తనూ రాయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగం, త్యాగం వంటి అంశాలను చాలా చక్కగా ఆవిష్కరించిన దర్శకుడు వీ. ఎన్.ఆదిత్య ఈ సినిమాకు ప్రాణం పోశారు . ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో భారీ సంచలనం సృష్టించి ఊహించని కలెక్షన్లను కూడా రాబట్టింది. అటు మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ప్రేమికుల ప్లే లిస్టులో తప్పనిసరిగా వినబడుతూనే ఉంటాయి. అలాంటి ఈ సినిమా ఈ ఏడాది ప్రేమికుల రోజున పురస్కరించుకొని ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు మళ్ళీ రాబోతోంది.
నిర్మాతలు నిరంజన్ రెడ్డి , చైతన్య రెడ్డి, రఘురాంరెడ్డి, రవికాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..” సున్నితమైన ప్రేమ కథతో రూపొందించిన ఈ సినిమా 2001లో విడుదలై సంచలనం సృష్టించింది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మళ్లీ నేటి తరానికి చేరువ చేయాలనే లక్ష్యంతోనే మళ్లీ మీ ముందుకు తీసుకొస్తున్నాం” అంటూ ప్రకటించారు.
ALSO READ:February 14 Movies: లవర్స్ డే స్పెషల్.. ఈవారం రీ రిలీజ్ , కొత్త సినిమాల సందడి..
అయితే ఈ విషయాన్ని ఉదయ్ కిరణ్ మేనల్లుడు కూడా చెబుతూ తాను కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇకపోతే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు.” అందరికీ నమస్కారం. నేను ఉదయ్ కిరణ్ మేనల్లుడిని. నా పేరు తేజ. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ ఫిబ్రవరి 14వ తేదీన మా మామ ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత లవ్, ఇంత కేర్, ఇంత ఎఫెక్షన్, ఇంత క్రేజ్ ఉందని నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఫిబ్రవరి 14న ఖచ్చితంగా ఆ మ్యాజిక్ ను మళ్లీ చూడడానికి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. ఆ సినిమా వచ్చినప్పుడు నాకు ఒక ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ థియేటర్లలో చూడడానికి నేను చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు తేజ.
?utm_source=ig_web_copy_link