E-Paper
Advertisement

Jr NTR: జూ.ఎన్టీఆర్ కి ఇష్టమైన స్నాక్స్ ఏంటో తెలుసా.. రివీల్ చేసిన మ్యాగజైన్!

Jr NTR: జూ.ఎన్టీఆర్ కి ఇష్టమైన స్నాక్స్ ఏంటో తెలుసా.. రివీల్ చేసిన మ్యాగజైన్!
Advertisement

Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నందమూరి వారసుడిగా.. దివంగత నటుడు హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ.. నేడు గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా జపాన్ వంటి దేశాలలో అపారమైన అభిమానాన్ని చూరగొన్నాడు. అలాంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరొకవైపు ప్రముఖ మ్యాగజైన్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు ఇష్టమైన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.. అందులో భాగంగానే గతంలో తనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పిన ఎన్టీఆర్.. తనకు ఇష్టమైన తెలుగు స్నాక్స్ ఐటమ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

నాకు ఇష్టమైన స్నాక్స్ అవే – ఎన్టీఆర్

విషయంలోకి వెళ్తే గతంలో “ఎస్క్వైర్ ఇండియా” అనే ఒక మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎన్టీఆర్ అందులో మాట్లాడుతూ.. “నాకు హైదరాబాద్ పునుగులు అంటే చాలా ఇష్టం . ముఖ్యంగా అల్లం చట్నీ లేదా పల్లీల చట్నీతో కలిపి తినడం అంటే ఇంకా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తనకు పునుగులు అంటే ఇష్టం అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో తనకు పూతరేకులు అంటే కూడా మహా ఇష్టమని తెలిపారు. ఇక గతంలో ఆయన పంచుకున్న ఈ ముచ్చట్లకు సంబంధించిన వీడియోని తాజాగా సదరు మ్యాగజైన్ టీం విడుదల చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఆ రెస్టారెంట్లో రుచులు అంటే మహా ఇష్టం..

Advertisement

ఇకపోతే ఎన్టీఆర్ గతంలో దేవర సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జపాన్ వెళ్లి.. అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఇండియా చేరుకున్న ఆయన జపాన్ టూర్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆ ఇంటర్వ్యూలో హైదరాబాద్లో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల గురించి వెల్లడించారు.” హైదరాబాదులో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కి చెందిన “షోయు” రెస్టారెంట్ నా మొదటి ఎంపిక. ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగచైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన “సుషీ” అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాదులో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది మాత్రమే. నిజంగా అంతర్జాతీయ వంటలకు షో యు కేర్ ఆఫ్ అడ్రస్” అంటూ ఎన్టీఆర్ కొనియాడారు.

ALSO READ:Mega 158: వీడిన సస్పెన్స్.. చిరంజీవి కూతురుగా ఆమే ఫైనల్!

ఎన్టీఆర్ మెచ్చిన హైదరాబాద్ రెస్టారెంట్లు..

Advertisement

ఇక దీంతో పాటు పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్ లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్పేటలోని కాకతీయ డీలక్స్ మెస్ వంటి రెస్టారెంట్లో ఆహారం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎన్టీఆర్ బిర్యానీని ఇష్టంగా తినడమే కాదు అద్భుతంగా వండుతారు కూడా.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×