E-Paper
Advertisement

Pradeep Ranganathan: పాన్ ఇండియా చిత్రాలకు పోటీవస్తున్న ప్రదీప్ రంగనాధన్.. ఆ గట్స్ ఏంటి బాసూ?

Pradeep Ranganathan: పాన్ ఇండియా చిత్రాలకు పోటీవస్తున్న ప్రదీప్ రంగనాధన్.. ఆ గట్స్ ఏంటి బాసూ?
Advertisement

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ పేరు ఒక సెన్సేషన్. కేవలం ‘లవ్ టుడే’ సినిమాతో యువతకు ఐకాన్‌గా మారిన ఈ కుర్ర హీరో, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా దిగ్గజాలకు సవాలు విసురుతున్నాడు. వరుస విజయాలతో వంద కోట్ల క్లబ్‌లో పాగా వేసిన ప్రదీప్, ఈసారి బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల హీరోలను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, స్టార్ హీరోయిన్ నయనతార సొంత నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌పై, ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ “లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ” (LIC). టైటిల్ దగ్గరి నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, విడుదల విషయంలో మాత్రం కొంత జాప్యం జరిగింది. గత ఏడాదే థియేటర్లలోకి రావాల్సి ఉన్నా, కాల్షీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే, తాజాగా మేకర్స్ ప్రకటించిన రిలీజ్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read also-Jr NTR: జూ.ఎన్టీఆర్ కి ఇష్టమైన స్నాక్స్ ఏంటో తెలుసా.. రివీల్ చేసిన మ్యాగజైన్!

వెయ్యి కోట్ల సినిమాలతో పోటీ!

Advertisement

వచ్చే ఏడాది, అంటే మార్చి 19, 2026న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సరిగ్గా అదే రోజున ఇద్దరు అగ్ర హీరోల భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. భారీ బడ్జెట్, భారీ అంచనాలు ఉన్న ఆ సినిమాలతో పోటీగా తన సినిమాను రిలీజ్ చేయాలని ప్రదీప్ నిర్ణయించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ పరిణామంపై భిన్నంగా స్పందిస్తున్నారు. “వంద కోట్లు కొల్లగొట్టిన ప్రదీప్, ఇప్పుడు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న హీరోల మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. విఘ్నేష్ శివన్ మార్క్ కామెడీ, ప్రదీప్ రంగనాథన్ యూత్ ఫుల్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు.. తాజాగా ఈ సినిమా కూడా మార్చి 19, 2026 న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

Read also-Mahesh Rajamouli: మహేష్ బాబు కోసం క్యూ కడుతున్న పాన్ ఇండియా నిర్మాతలు.. తర్వాత ఛాన్స్ ఎవరికంటే?

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×