E-Paper
Advertisement

Mega 158: వీడిన సస్పెన్స్.. చిరంజీవి కూతురుగా ఆమే ఫైనల్!

Mega 158: వీడిన సస్పెన్స్.. చిరంజీవి కూతురుగా ఆమే ఫైనల్!
Advertisement

Mega 158:చిన్న సినిమాలను కాస్త పక్కన పెడితే.. పెద్ద హీరోలు.. బడా నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నారు అంటే ఇక ఆ సినిమాలో ఏ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే విషయాలను చిత్రం బృందం అధికారికంగా ప్రకటించే వరకు ఎవరో ఒకరి పేరు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) ఈ ఏడాది ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత చేస్తున్న “మెగా 158” సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి . పైగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన బాబి (Bobby kolli) తో ఈ సినిమా చేస్తుండడంతో ఆ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది అనడంలో సందేహం లేదు.

చిరంజీవి కూతురుగా?

దీనికి తోడు బెంగాల్ మాఫియా డాన్ కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక చిరు – బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు రాగా.. ఇక ఆయన కూతురిగా ఎవరు నటిస్తారు అనే దానిపై గత కొద్ది రోజులుగా రోజుకొక పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదటగా ఈ పాత్ర కోసం ‘ఉప్పెన’ సినిమాతో సంచలనం అందుకున్న కృతి శెట్టి (Krithi Shetty) పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత మలయాళ భామ అనస్వర రాజన్ (Anaswara rajan) ఈ పాత్రకు ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. పైగా రోషన్ మేక(Roshan meka) హీరోగా వచ్చిన ‘ఛాంపియన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమెకు.. తన రెండవ సినిమాతోనే ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడం అదృష్టం అని అందరూ అనుకున్నారు..

అదృష్టం అందుకున్న ప్రీతి ముకుందన్..

Advertisement

అయితే ఇప్పుడు చిరంజీవి – బాబి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కృతి శెట్టి కాదు.? అనస్వర అంతకన్నా కాదు.. ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ఫిక్స్ అయింది. మెగాస్టార్ కూతురిగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది.. ఇప్పటికే తెరపైకి పలువురు పేర్లు వినిపించినా.. ఫైనల్ గా ప్రీతి ముకుందన్ ఈ అదృష్టాన్ని దక్కించుకుందని చెప్పవచ్చు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే ఈ మెగా ప్రాజెక్ట్ ఈమె కెరియర్ కు పెద్ద బూస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు..

ALSO READ:Raashii Khanna: మహాశివరాత్రి స్పెషల్.. భక్తి పారవశ్యంలో ముంచెత్తిన రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

ప్రీతి ముకుందన్ సినిమాలు..

Advertisement

ఇకపోతే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా ప్రీతి ముకుందన్ భాగమైంది. ‘కన్నప్ప’ సినిమాతో సంచలనం సృష్టించిన ఈమె.. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంలో రోషన్ మేక సరసన హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లో ఈమె లుక్ చాలా ఫ్రెష్ గా , స్ట్రైకింగ్ గా ఉండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుసగా రెండు పెద్ద సినిమాలు, అగ్ర దర్శకులు, ప్రముఖ నిర్మాణ సంస్థలతో పనిచేసే అవకాశం లభించడంతో ప్రస్తుతం ప్రీతీ ముకుందన్ టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా ప్రీతి ముకుందన్ కి ఇప్పుడు అదృష్టం గట్టిగానే పట్టుకుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూడాలి.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×