E-Paper
Advertisement

NTR Trivikram Movie : కుమారస్వామి ముందుకు వచ్చాడు.. ఎన్టీఆర్ న్యూ మూవీపై బిగ్ అప్డేట్

NTR Trivikram Movie : కుమారస్వామి ముందుకు వచ్చాడు.. ఎన్టీఆర్ న్యూ మూవీపై బిగ్ అప్డేట్
Advertisement

NTR Trivikram Movie : దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్ చేతి నిండా సినిమాలతో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను ఫస్ట్ పూర్తి చేయాలని చేస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్‌కు బల్క్ డేట్స్ ఇచ్చాడు తారక్.

ఇక్కడి వరకు బానే ఉంది. కానీ, ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఏంటి ? దానికి ఎవరు డైరెక్టర్ ? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలంటే… ప్రశాంత్ నీల్ డ్రాగన్ తర్వాత… కొరటాల శివతో దేవర 2 మూవీ ఉంది. అలాగే తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో అగ్రిమెంట్ అయింది. అలాగే టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా ఉంది.

Advertisement

ఈ సినిమా కుమార స్వామి నేపథ్యంలో ఉండే మైథలాజికల్ ఫాంటాసీ మూవీ. ముందుగా ఈ సినిమా స్టోరీని త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌కు వినిపించాడు. అయితే అల్లు అర్జున తన తర్వాత సినిమా అట్లీతో ఫిక్స్ చేసుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ తన కథను తీసుకొచ్చి ఎన్టీఆర్ కి వినిపించాడు. ఎన్టీఆర్ ఫైనల్ కూడా చేశాడు. ఈ విషయం అంతా తెలిసిందే.

అయితే, ఇప్పుడున్న ప్రశ్న… ప్రశాంత్ వర్మ డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ చేసే మూవీ ఏది అని. మొన్నటి వరకు డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ దేవర 2 సినిమా చేస్తాడనే ప్రచారం ఉండేది. అందుకే కొరటాల శివ కూడా వేరే ప్రాజెక్ట్ పెట్టుకోకుండా… దేవర 2పైనే వర్క్ చేస్తున్నాడు అనే ప్రచారం సాగింది. అంతే కాదు… డిసెంబర్‌లో దేవర 2 రెగ్యూలర్ షూటింగ్ అంటూకూడా టాక్ వినిపించింది.

Advertisement

దీని తర్వాత.. నెల్సన్ దీలీప్‌ కుమార్‌తో సినిమా ఉంటుంది అనే టాక్ వచ్చింది. దీనికి నెల్సన్ కూడా రెడీ అయిపోయి ఉన్నాడంట. అయితే.. ఇప్పుడు లైన‌ప్ పూర్తిగా మారినట్టు తెలుస్తుంది. డ్రాగన్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నేరుగా.. త్రివిక్రమ్ తో చేయబోతున్నాడంట.

త్రివిక్రమ్ ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. వీరి సినిమాలు పూర్తి అయిన వెంటనే… ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని సమాచారం.

ఈ మూవీ అయ్యాకే… నెల్సన్ మూవీ ఉంటుంది. ఇక దేవర 2 మూవీ… నెల్సన్ మూవీ పూర్తి అయ్యక ఉండబోతుందని సమాచారం. అదే జరిగితే… ఎన్టీఆర్‌ను మైథాలజికల్ మూవీలో చూడాలి అని ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ కాస్త ఎర్లీగానే చెప్పినట్టు అవుతుంది.

ఈ గాసిప్స్ పక్కన పెడితే.. ఎన్టీఆర్‌కి కూడా త్రివిక్రమ్ తో ముందుగా సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. మొన్నామధ్య ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా… కుమారస్వామి కి సంబంధించిన బుక్స్ క్యారీ చేయడం అందరూ చూశారు. అంటే, త్రివిక్రమ్ సినిమా కోసం, ఆ పాత్ర కోసం తారక్ రెడీ అవుతున్నాడు అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×