E-Paper
Advertisement

Pradeep Ranganathan: తెలుగులో భారీ రెమ్యూనరేషన్, ఇండస్ట్రీని పాడు చేస్తున్నారా?

Pradeep Ranganathan: తెలుగులో భారీ రెమ్యూనరేషన్, ఇండస్ట్రీని పాడు చేస్తున్నారా?
Advertisement

Pradeep Ranganathan: కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. మీరు హీరో మెటీరియల్ గా అనిపించరు అని ఒక లేడీ జర్నలిస్ట్ ప్రదీప్ ను అంటే, చాలామంది తెలుగు ఆడియన్స్ ఆ జర్నలిస్టును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంటే దీనిని బట్టి ప్రదీప్ రంగనాథన్ పైన ఎంత ప్రేమను పెంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన ప్రదీప్ కోమాలి సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. జయం రవి నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత లవ్ టు డే సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దిల్ రాజు ఆ సినిమాను డబ్బింగ్ చేశారు. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా మంచి సక్సెస్ అయింది. రీసెంట్ గా వచ్చిన డ్యూడ్ మూవీ కూడా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

తెలుగులో భారీ రెమ్యునరేషన్ 

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ నిర్మాణ సంస్థ ప్రదీప్ రంగనాథన్ కు ఒక సినిమా కోసం భారీ స్థాయిలో అడ్వాన్స్ ఇచ్చారట. ప్రదీప్ రంగనాథన్ కెరియర్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆ బ్యానర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ రెమ్యూనరేషన్ చూసి ప్రదీప్ కూడా షాక్ అయ్యాడట.

గతంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఎవరు ఇవ్వలేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సరైన హీరోలు లేరా? లేకపోతే ప్రస్తుతం అభిమానుల్లో ప్రదీప్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారా అని ఇండస్ట్రీ వర్గాల్లో టాపిక్ నడుస్తుంది.

ఇండస్ట్రీని పాడు చేస్తున్నారా? 

Advertisement

హీరోలకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది వాళ్ల వరకు మంచిదే. కానీ ఆ డబ్బులను మళ్లీ వసూలు చేయాలి అంటే అది ప్రేక్షకులు దగ్గరే చేస్తారు. సినిమా టికెట్ కాస్ట్ కూడా ఈ రోజుల్లో పెరిగిపోయింది. అయితే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఎవరు ఇవ్వడం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది అవసరమా.?

ఎవరి దృష్టిలో కూడా లేని రెమ్యూనరేషన్ ఇచ్చి ఇండస్ట్రీని పాడు చేస్తున్నారా అని చాలామందికి వస్తున్నా అనుమానం. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా వర్కౌట్ అయితే పర్వాలేదు కానీ పొరపాటున ఫెయిల్ అయింది అంటే నిర్మాత కంటే ముందు డిస్ట్రిబ్యూటర్ నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

Also Read: Mana Shankara Varaprasad Gaaru : భీమ్స్ చేసిన పనికి మెగాస్టార్ మూవీ షూటింగు క్యాన్సిల్?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×