E-Paper
Advertisement

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?
Advertisement

Jr NTR: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ (Venkatesh ) తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెంబర్ 47’.. నిజానికి వెంకటేష్ నటించిన ఎన్నో చిత్రాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు అని అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కామెడీ, క్రైమ్, డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఆదర్శ కుటుంబంలోకి ఎన్టీఆర్..

భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదర్శ కుటుంబం చిత్రంలోకి ఎన్టీఆర్ ఎంట్రీ అంటూ వస్తున్న వార్త సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ కానున్న నేపథ్యంలో .. ఈ సినిమాలో కీలకపాత్రల పరిచయంతో పాటు వెంకీ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం.. ఇకపోతే ఎన్టీఆర్ వాయిస్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది.

లెనిన్ కి కూడా వాయిస్ ఓవర్..

Advertisement

ఇకపోతే అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇటీవల నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న లెనిన్ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా వందకోట్ల క్లబ్లో చేరి లెనిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అలా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆదర్శ కుటుంబం కూడా మంచి సక్సెస్ అవుతుందనే నేపథ్యంలో ఆయన చేత వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నారనే వార్తలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ:ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

ఆదర్శ కుటుంబం ఏకే 47 విశేషాలు..

Advertisement

వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ఆయనకు భార్య పాత్రలో నటిస్తోంది. కూతురిగా సంపూర్ణ పాత్రలో యువినా భార్గవి , కొడుకు సర్వ పాత్రలో రాజా ప్రజ్వల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు రావు రమేష్, బ్రహ్మాజీ, నారా రోహిత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలు..

ఎన్టీఆర్ ప్రస్తుతం భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోపక్క ఆయన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక మరొకవైపు ఇలా కొన్ని చిత్రాలకు వాయిస్ ఓవర్ అందిస్తూ మరింత బిజీగా మారారు ఎన్టీఆర్.

Related News

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

ఘనంగా చంద్రబోస్ కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్ వీరే!

సిగరెట్ తాగుతూ ప్రేయసితో అడ్డంగా బుక్కైన జయం రవి.. వీడియో వైరల్!

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×