E-Paper
Advertisement

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎట్టకేలకు సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 గంటలకు ఘనంగా ప్రారంభం అయింది. షో అలా ప్రారంభమైందో లేదో అప్పుడే బిగ్ బాస్ తన ఆట మొదలు పెట్టేసాడు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ‘కీ’ల కోసం ప్రారంభించిన ఆటలో చివరి రెండు కీ లను ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకొని చెప్పండి అంటూ చిచ్చు పెట్టేసాడు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ మధ్య మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ఏకంగా రెండు వర్గాలుగా విడిపోయింది అనే విషయం మాత్రం ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 10 డే వన్ ఎపిసోడ్ ప్రోమో..

సోమవారం అనగా సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటలు యుద్ధం మరింత ఆసక్తిని కలిగించింది. తొలి టాస్క్ లో భాగంగా ఇప్పటికే 8 మంది కంటెస్టెంట్స్ ‘కీ’లను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి మాత్రమే ఆ రెండు కీ లను ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి అనేది మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ చెప్పినట్టు ప్రోమోలో చూపించారు. దీంతో ఎవరికీ ఆ అవకాశం దక్కుతుంది అనే ఉత్కంఠ ఆడియన్స్లో నెలకొంది. మరొకవైపు ఈ కీ లు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు ప్రోమోలో చూపించారు.

Advertisement

ALSO READ:సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

కీ కోసం కంటెస్టెంట్స్ మధ్య గొడవ..

ముఖ్యంగా ముఖేష్ గౌడ.. రాంప్రసాద్, త్రిగుణ్ తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. “నాకు అన్ని తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు” అంటూ ముఖేష్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే త్రిగున్ మరో టీం తో మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. మీతో ఆడితే గెలవచ్చు అంటూ టెంపర్ వంశీని దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్ లో గ్రూపులు ఏర్పడుతున్నాయా అనే ఆసక్తి కూడా ప్రేక్షకులలో నెలకొంది. మరి ఆ రెండు కీ లను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? అనే విషయం తెలియాలి అంటే ఈరోజు రాత్రి ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. మొత్తానికైతే ఆట పేరుతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టి సరదా ఆట చూస్తున్నావా బిగ్ బాసూ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!

జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

Big Stories

Advertisement
×