Telangana High Court: పార్లమెంటు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు నేడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులకు తెలంగాణ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీకి వెళ్లే MLAలను అడ్డుకోవద్దని హైకోర్టు తెలిపింది.
పార్టీ ఎమ్మెల్యేలు ఓక వేల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉంటుందని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో శాసనసభ్యులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారిని అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసిన పోలీసులను గుర్తించాలని కోర్డు పేర్కోంది.
Also read: అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్!
అసెంబ్లీ ముందు దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై హోంశాఖ జీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. హైకొర్టు ఆదేశాలతో పోలీసులు ఎవిధంగా స్పందిస్తారో చూడాలి.
Also read: బౌరంపేటలో ఘోర అగ్ని ప్రమాదం.. కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనం!