E-Paper
Advertisement

K.V.Anudeep: వెంకీ మామతో అనుదీప్ మూవీ..  డబుల్ డోస్ కామెడీ పక్కా?

K.V.Anudeep: వెంకీ మామతో అనుదీప్ మూవీ..  డబుల్ డోస్ కామెడీ పక్కా?
Advertisement

K.V.Anudeep: జాతి రత్నాలు సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కెవి అనుదీప్ తదుపరి ఇదే తరహా కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే ఈయన నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఫంకీ (Funky)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

వెంకటేష్ తో అనుదీప్ మూవీ..

ఇకపోతే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనుదీప్ (Anudeep)తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది అనే విషయంపై ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఫంకీ సినిమా తర్వాత దర్శకుడు కె.వి అనుదీప్ తన తదుపరి ప్రాజెక్టు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) తో చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వెంకటేష్ కోసం అనుదీప్ ఒక స్టోరీ కూడా సిద్ధం చేశారని ఈ స్టోరీ వెంకటేష్ కు వినిపించడంతో కొన్ని మార్పులు చేయాలి అంటూ సూచనలు చేశారని తెలుస్తోంది.

కామెడీకి కేరాఫ్ అడ్రస్..

Advertisement

ప్రస్తుతం అనుదీప్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారని ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిన తర్వాత మరోసారి వెంకటేష్ కు కథ వినిపించి ఆయన ఒప్పుకుంటే ఈ సినిమా చేసే ఆలోచనలో అనుదీప్ ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా అనుదీప్ సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. కామెడీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వెంకటేష్ కూడా అనుదీప్ కు తోడైతే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని, డబుల్ డోస్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అనిల్ రావిపూడి తో వెంకటేష్ సినిమా?

Advertisement

ఇక వెంకటేశ్ ప్రస్తుతం వరుస హిట్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న వెంకటేష్ ఈ ఏడాది ఆదర్శ కుటుంబం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరమే అనుదీప్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: Ranbir Kapoor: నేను పడిన బాధ నా కూతురికి వద్దు.. రణబీర్ ఎమోషనల్ కామెంట్స్!

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×