E-Paper
Advertisement

World Tourism: టూరిజం ద్వారా కోట్లు కురిపిస్తున్న దేశాలు.. నంబర్ 1 ఎవరో తెలుసా ?

World Tourism: టూరిజం ద్వారా కోట్లు కురిపిస్తున్న దేశాలు.. నంబర్ 1 ఎవరో తెలుసా ?
Advertisement

World Tourism: పర్యాటకం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముక లాంటిది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం మళ్ళీ పుంజుకోవడంతో.. 2024-25 నాటికి ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. అయితే విదేశీ పర్యాటకుల సంఖ్య ఒక ఎత్తు అయితే, వారు ఖర్చు చేసే సగటు ఆదాయం మరో ఎత్తు. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఏటా బిలియన్ల కొద్దీ డాలర్లను పర్యాటకం ద్వారా ఆర్జిస్తున్నాయి. అసలు ప్రపంచంలో టూరిజం ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న అగ్ర దేశాలేవి? వాటికి ఆ ఆదాయం ఎలా వస్తోంది? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ పర్యాటక సంస్థ (UN Tourism), తాజా ఆర్థిక నివేదికల ప్రకారం, పర్యాటక రంగం ప్రపంచ జిడిపిలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. అత్యధిక ఆదాయం పొందుతున్న దేశాల జాబితాను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

1. అమెరికా:
పర్యాటక ఆదాయంలో అమెరికా తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. 2024లో ఈ దేశం సుమారు $215 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు వినోదం, షాపింగ్ , సుదీర్ఘ ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేస్తారు. న్యూయార్క్, లాస్ వెగాస్, గ్రాండ్ కాన్యన్ వంటి ప్రదేశాలు విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తాయి.

2. స్పెయిన్:
ఐరోపాలో పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ స్పెయిన్. ఇది సుమారు $106.5 బిలియన్లతో రెండో స్థానంలో నిలిచింది. అందమైన బీచ్‌లు, చారిత్రక నగరాలు, ఆహార సంస్కృతి స్పెయిన్ సొంతం. ముఖ్యంగా ఐరోపా ఖండం నుంచే ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

Advertisement

3. యునైటెడ్ కింగ్‌డమ్ :
లండన్ వంటి ప్రపంచ స్థాయి నగరాలు ఉన్న బ్రిటన్, పర్యాటక ఆదాయంలో $82.5 బిలియన్లతో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ చారిత్రక కట్టడాలు, మ్యూజియంలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

4. ఫ్రాన్స్ :
ప్రపంచంలోనే అత్యధిక మంది పర్యాటకులు సందర్శించే దేశం ఫ్రాన్స్ అయినప్పటికీ.. ఆదాయ పరంగా ఇది నాలుగో స్థానంలో ఉంది. 2024లో దీని ఆదాయం సుమారు $77 బిలియన్లు. పారిస్‌లోని ఈఫిల్ టవర్, లౌవ్రే మ్యూజియం, వైన్ టూరిజం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

5. ఇటలీ,జపాన్ :
ఇటలీ తన కళా సంపదతో $58.7 బిలియన్లు ఆర్జిస్తుండగా.. జపాన్ అనూహ్య వృద్ధిని సాధించింది. కరెన్సీ విలువ తగ్గడం , సరిహద్దులు పూర్తిగా తెరవడంతో జపాన్ సుమారు $54.7 బిలియన్ల ఆదాయాన్ని సాధించి ఆసియాలో అగ్రగామిగా నిలిచింది.

Also Read: వందే భారత్‌కు బాంబు ముప్పు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఆగంతకుడి లేఖ.. వణికిపోతున్న ప్రయాణికులు!

ఆదాయం పెరగడానికి కారణాలేంటి ?

పర్యాటక ఆదాయం కేవలం టూరిస్టుల సంఖ్యపైనే కాకుండా.. వారు అక్కడ చేసే సగటు ఖర్చుపై ఆధారపడి ఉంటుంది.

మెరుగైన మౌలిక సదుపాయాలు: విమానయానం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న దేశాలకు పర్యాటకులు మొగ్గు చూపుతారు.

లగ్జరీ టూరిజం: దుబాయ్ వంటి దేశాలు కేవలం విలాసవంతమైన టూరిజం ద్వారా తక్కువ మంది పర్యాటకులతోనే ఎక్కువ ఆదాయాన్ని (సుమారు $57 బిలియన్లు) గడిస్తున్నాయి.

డిజిటల్ చెల్లింపులు: సులభతరమైన వీసా విధానాలు, డిజిటల్ పేమెంట్స్ కూడా పర్యాటక వృద్ధికి దోహద పడుతున్నాయి.

Related News

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

Big Stories

Advertisement
×