E-Paper
Advertisement

Ranbir Kapoor: నేను పడిన బాధ నా కూతురికి వద్దు.. రణబీర్ ఎమోషనల్ కామెంట్స్!

Ranbir Kapoor: నేను పడిన బాధ నా కూతురికి వద్దు.. రణబీర్ ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Ranbir Kapoor: రణబీర్ కపూర్ కేవలం బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇటీవల తన సినిమాలను సౌత్ ఇండస్ట్రీలో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా రణబీర్ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కుమార్తె రాహా(Raaha) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటి అలియా భట్(Alia Bhatt) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే.

నాన్నతో సంతోషంగా గడపలేదు..

ఇలా తమ కుమార్తెతో వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ వృత్తి పరమైన జీవితంలో కూడా వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక రాహా పుట్టిన తర్వాత ఆలియా, రణబీర్ పూర్తిగా తమ అలవాట్లను మార్చుకున్నట్టు పలు సందర్భాలలో తెలియచేశారు. తాజాగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి మా నాన్నకు నాకు మధ్య కాస్త గ్యాప్ ఉండేది మేమిద్దరం ఎప్పుడూ కూడా సరదాగా స్నేహపూర్వకంగా గడపలేదు. ఆ జనరేషన్ లో తండ్రి కొడుకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది కాదు. ఇలా తండ్రీ కొడుకుల మధ్య ఒక గోడ లాంటి అడ్డు ఉండేదని తెలిపారు.

గోడ బద్దలు కొడతా..

Advertisement

ఇలా చిన్నప్పుడు తాను తన తండ్రితో సరైన సమయాన్ని ఆనందంగా గడపలేకపోయాను. ఆ క్షణం నేను పడిన బాధను ఇప్పుడు నా కూతురు పడకూడదు అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న ఆ గోడను బద్దలు కొడతానని, తనతో ఒక మంచి స్నేహితుడి లాగా ఉండాలని తను ఏది కోరుకుంటే ఆ విషయంలో సక్సెస్ అందుకోవడానికి మద్దతుగా నిలుస్తాను అంటూ రణబీర్ కపూర్ తన కూతురి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆలియా కూడా తన కుమార్తె కోసం తన అలవాట్లను కూడా మార్చుకున్నట్టు ఇటీవల ఓ సందర్భంలో తెలియజేశారు. ఇలా కూతురు విషయంలో వీరిద్దరూ తల్లిదండ్రులుగా పూర్తి బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పాలి.

రామాయణ సినిమాలో రణబీర్..

Advertisement

ఇక వీరి కెరియర్ విషయానికి వస్తే ఆలియా భట్ ప్రస్తుతం లవ్ అండ్ వార్, ఆల్ఫా వంటి సినిమాలలో నటిస్తున్నారు. ఇక రణబీర్ కపూర్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలతో పాటు రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర 2 సినిమా కూడా చేయబోతున్నారు అలాగే డాన్ 3 చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈయన తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సరైన స్పష్టత లేదు.

Also Read: Supritha: సుప్రీతతో పెళ్లి .. రూ.20 వేలు ఖర్చు చేసిన అభిమాని..నటి రియాక్షన్ ఇదే!

Related News

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×