Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగారు. తెలుగు తమిళ అనే తేడా లేకుండా వరుస భాష సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. పెళ్లి తర్వాత ఈమె సినిమాలను కూడా పూర్తిగా తగ్గించారు. తెలుగులో భగవంత్ కేసరి, కన్నప్ప అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. ఇకపోతే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న రామాయణ (Ramayana)సినిమాలో నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి..
రామాయణ సినిమాలో ఈమె రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నా, చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ రామాయణ సినిమాలో భాగమైన విషయాన్ని అధికారకంగా తెలియజేయడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు రామాయణ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ ఈ గ్లింప్స్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఇలా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ అగర్వాల్.. ప్రతి తరం శ్రీరాముడి పేరుతోనే పెరిగారు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ఆయనని దర్శించుకోబోతోంది. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. ఇలాంటి ఒక గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ కాజల్ అగర్వాల్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో కాజల్ ఈ సినిమాలో నటిస్తున్న మాట నిజమేనని స్పష్టం అవుతుంది. మరి ఈమె మండోదరి పాత్రలోనే కనిపించబోతున్నారా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
?igsh=Nzh0NHRsOGZkb3cz
ఇక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ లుక్ ఎంతో అద్భుతంగా ఉందని తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఈయన పాత్రకు సంబంధించిన లుక్ మినహా ఇతరుల పాత్రలను ఎక్కడ పరిచయం చేయలేదు. ఇక రాముడిగా రణబీర్ నటించగా, సీతగా సాయి పల్లవి కనిపించబోతున్నారు. రావణాసురుడి పాత్రలో యశ్ నటించబోతుండగా, ఈయనకు సతీమణి మండోదరి పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో కాజల్ భాగమైన మాట వాస్తవమే కానీ ఏ పాత్రలో నటించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కాగా రెండో భాగం 2027 దీపావళిని పురస్కరించుకొని విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.
Also Read: సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమాలో మరో స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న డైరెక్టర్!