Kalki 2: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే అందులో నటించడం కోసం పనిచేయడం కోసం టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు కాస్టింగ్ కాల్స్ వస్తూనే ఉంటాయి అయితే ఇదే అదునుగా భావించి కొంతమంది ఫేక్ కాస్టింగ్ కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ బ్యానర్(Vyjayanthi movies banner) పేరుతో ఇలాంటి ఫేక్ కాస్టింగ్ కాల్స్ జరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేసింది.
వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే కల్కి 2(Kalki 2) కోసం ఆడిషన్లు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఒక కీలక పోస్ట్ షేర్ చేశారు. వైజయంతి మూవీస్ తెలియజేయునది ఏమనగా మా తరఫున ఆడిషన్లు లేదా కాస్టింగ్ నిర్వహించడానికి మాకు థర్డ్ పార్టీ ఏజెన్సీ, కంపెనీ వ్యక్తి లేదా కాస్టింగ్ ప్రతినిధితో సంబంధం లేదని తెలిపారు. మేము ఎవరికీ అలాంటి అధికారం కూడా ఇవ్వలేదు దయచేసి మాకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకొని ఎవరి వద్ద మీ వ్యక్తిగత విషయాలను అలాగే ఆడిషన్ మెటీరియల్ కూడా పంచుకోవద్దని ముఖ్యంగా అలాంటి వారికి ఎలాంటి చెల్లింపులు చేయొద్దు అంటూ నిర్మాణ సంస్థ సూచించింది.
ఇలా మా నిర్మాణ సంస్థ పేరును అధికారకంగా ఉపయోగించిన లేదా తప్పుడు ప్రచారాలకు ఉపయోగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ఫేక్ కాల్స్ ద్వారా ఎవరు మోసపోవద్దు మీకు ఏ విధమైనటువంటి అధికారిక సమాచారం కావాలన్నా వెంటనే మా అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఇలా వైజయంతి మూవీస్ బ్యానర్ పేరిట జరుగుతున్న మోసాలకు నిర్మాణ సంస్థ ఈ విధంగా చెక్ పెట్టారు.
Important Clarification:
Please beware of fake casting calls and individuals falsely claiming to represent #VyjayanthiMovies.#Kalki2898AD pic.twitter.com/THPfGvUcmD
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 3, 2026
ఇక ఈ బ్యానర్ ద్వారా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Aswin) దర్శకత్వంలో కల్కి సీక్వెల్(Kalki 2) సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రభాస్ తన కమిట్మెంట్స్ వల్ల బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని ప్రభాస్ డేట్స్ ఇస్తే వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని ఇటీవల డైరెక్టర్ నాగ్ వంశీ ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు . ఇక కల్కి సినిమా 2024 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
Also Read: సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !