E-Paper
Advertisement

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!
Advertisement

Vinayaka Chavithi 2026: మనదేశంలో అత్యంత వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునే పండగలలో వినాయక చవితి ఒకటి. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజున గల్లీ గల్లీలో గణేశుని మండపాలు వెలుస్తాయి. అంతే కాకుండా ఇళ్లలో చిన్న చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇంతకీ ఈ ఏడాది వినాయక చవిత ఎప్పుడు ప్రారంభమవుతోంది? వినాయక ప్రతిష్టుకు అత్యంత శుభప్రదమైన సమయం ఏది? ఈ పండగకు సంబంధించిన శుభ ముహూర్తం, మరిన్ని వివరాలు  ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి తేదీ, ముహూర్తం:

ప్రతి హిందూ కుటుంబం అత్యంత నిష్టతో జరుపుకునే వినాయక చవితి విశేషాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. విజ్ఞానానికి అధిపతి అయిన విఘ్నేశుడిని మనసారా కొలిస్తే.. సకల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

1. వినాయక చవితి తేదీ, సమయం :

Advertisement

పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజుల వినాయక చవితి పండగ జరుపుకోనున్నాము. భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి తిథి రోజున దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి. భక్తులు తమ ఇళ్లలో, కాలనీలలో రకరకాల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రుల పాటు పూజలు నిర్వహిస్తారు.

Also Read: గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

2. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ సమయం:

Advertisement

పండగ రోజున గణేశుని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి మంచి ముహూర్తం చూసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం దాటిన తర్వాత.. అభిజిత్ లగ్నంలో లేదా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఇంట ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.

3. విగ్రహాల తయారీ, పర్యావరణ హితం:

ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కొనడానికి ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లో చిన్న విగ్రహాల నుంచి పెద్ద సైజు మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.

4. నవరాత్రుల వేడుకలు, నిమజ్జనం:

మొదటి రోజు వైభవంగా ప్రారంభమైన గణేశోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత సందడిగా సాగుతాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరి రోజు భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకను నిర్వహించి.. వచ్చే ఏడాది త్వరగా రావాలని స్వామివారిని వేడుకుంటూ సాగనంపుతారు.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×