Yesha Nagula song: ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమాలలో కూడా ఉండటమే కాకుండా థియేటర్లలో ఈ పాటలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో కూడా ఇలాంటి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఏష నాగుల (Yesha Nagula)కట్టమీద అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ పాట వైరల్ అవ్వడమే కాకుండా ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఇక ఈ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే మంచి ఆదరణను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడంతో ఈ పాటకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతుంది. ఇక ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పోస్టర్ ద్వారా తెలియచేస్తూ యేషనాగుల కట్ట పాటకు ఇలాంటి ఆదరణ వస్తుందని అసలు ఊహించలేదు విడుదలైన ఐదు రోజులలోనే 50 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా ఈ పాట రికార్డు సృష్టించిందని నిర్మాతలు తెలియజేశారు. ఇలా ఈ పాట తక్కువ సమయంలోనే మంచి ఆదరణను సొంతం చేసుకున్న నేపథ్యంలో నాని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ పాటలో నానికి జోడిగా నటి కీర్తి సురేష్ (Keerthi Suresh)సందడి చేశారు .ఈ పాటకు ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్ లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఆయా షేర్ పాటకు కూడా ఇదే స్థాయిలో ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ సింగిల్ ఏష నాగుల కట్టమీద పాటకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించడం గమనార్హం. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతమ అందిస్తున్న విషయం తెలిసిందే. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో నాని కయాదు లోహర్ జంటగా నటిస్తున్నారు.
#Yeshanagula sets an unprecedented record 🔥🔥
Becomes the FASTEST TELUGU SONG TO HIT 50 MILLION+ VIEWS in under 5 days 💥💥#TheParadise second single is TRENDING #1 on YouTube Global Charts ❤🔥
GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.
Natural Star… pic.twitter.com/uVMACvbSOC
— SLV Cinemas (@SLVCinemasOffl) September 3, 2026
ఇక ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో కీర్తి సురేష్ సందడి చేయడం విశేషం. ఇప్పటికే ప్యారడైజ్ షూటింగ్ పనులు మొత్తం పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో ఊర మాస్ లుక్ జడల్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇందులో సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఇక సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు వంటి తదితరులు కూడా భాగమయ్యారు. మరి సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ కొట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
Alasao Read: ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?