E-Paper
Advertisement

Kalki 2 Update: ప్రభాస్ కల్కి 2లో సాయి పల్లవి లేనట్టే.. కారణమేమిటంటే..!

Kalki 2 Update: ప్రభాస్ కల్కి 2లో సాయి పల్లవి లేనట్టే.. కారణమేమిటంటే..!
Advertisement

Kalki 2 Update: గత కొంతకాలంగా కల్కి 2లో హీరోయిన్ ఎవరు అన్న దానిపైన అనుమానం నెలకొంది. మరోపక్క ఈ సినిమా..మొదటి భాగం భారీ విజయం సాధించినప్పటికీ.. సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో, నిజంగా వస్తుందో లేదో అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. చాలా మంది అభిమానులు ఈ సినిమా ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందని.. లేదా అసలు జరగకపోవచ్చని కూడా అనుకున్నారు.

అయితే ఇటీవల పరిస్థితి ఒక్కసారిగా మారింది. ది రాజా సాబ్ సినిమా ఫలితం తర్వాత, ప్రభాస్ తన తదుపరి సినిమాలపై స్పష్టత తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా సలార్ 2 కంటే ముందు కల్కి 2కి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభాస్ భావిస్తున్నట్టు సమాచారం. కల్కి 2కి బాక్సాఫీస్‌లో మరింత అవకాశాలు ఉన్నాయని ఆయన అనుకుంటున్నారని టాక్. అంతేకాదు.. ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం ప్రభాస్ 10 రోజులు కేటాయించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

Advertisement

కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అదే హీరోయిన్ విషయం. కల్కి మొదటి భాగంలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె గత ఏడాది సీక్వెల్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇది ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె స్థానంలో ఎవరు వస్తారు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు బాగా వైరల్ అవుతోంది. ఆమెను సుమతి పాత్రకు ఫైనల్ చేశారనే వార్తలు వచ్చాయి. సుమతి పాత్ర కల్కి 2లో చాలా కీలకమని, కమల్ హాసన్ పాత్రతో పాటు ఈ పాత్రకు కూడా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పాత్రలకు కూడా భారీ ప్రాధాన్యం ఉండటంతో, ఈ నాలుగు శక్తివంతమైన పాత్రలను బ్యాలెన్స్ చేయడం దర్శకుడు నాగ్ అశ్విన్కి పెద్ద సవాల్‌గా మారింది.

Advertisement

నటన పరంగా చూస్తే.. సాయి పల్లవి భావోద్వేగాలకు బాగా న్యాయం చేసే నటి. అలాంటి పాత్రను ఆమె బాగా చేయగలదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ దీపికా లాంటి పాన్ ఇండియా స్టార్‌ను రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ప్రేక్షకుల అంగీకారం చాలా ముఖ్యం.

అదే సమయంలో మరో ప్రాక్టికల్ సమస్య కూడా ఉంది. సాయి పల్లవి ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ బాలీవుడ్ రామాయణం సినిమాలో బిజీగా ఉంది. ఆ షూటింగ్ పూర్తయ్యే వరకు కొత్త సినిమాలు సైన్ చేయనని..ఆమె భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో సాయి పల్లవి కల్కి 2 చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

హీరోయిన్ సమస్య త్వరగా పరిష్కారమైతే, కల్కి 2 షూటింగ్ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Aishwarya Rajesh: సినిమాలలోకి రాకముందు ఐశ్వర్య రాజేష్ అలాంటి పనులు చేశారా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×