E-Paper
Advertisement

అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?

అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?
Advertisement

Kalki Delay : ‘కల్కి 2898 AD’సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్ల పై చిలుకు వసూలు చేయడంతో సీక్వెల్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇక సినిమా కూడా జోరుగా షూటింగ్ చేసుకుంటుండటంతో ఈ ఏడు రిలీజ్ పక్కా అని మురిసిపోయారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ విషయంలో వినిపిస్తున్న టాక్ మాత్రం నెట్టింట నెగెటివ్ ట్రోల్స్ కి కారణమవుతుంది. యస్..థియేటర్లలో కల్కి 2 ఎంట్రీ ఇవ్వాలంటే మరో ఏడాదిన్నర పట్టనుందట.అంటే డిసెంబర్ 2027 వరకు మూవీ లవర్స్ వెయిట్ చెయ్యాల్సిందేనన్నమాట.

ఏప్రిల్ 2027 వరకు షూటింగ్‌

Advertisement

నిజానికి సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ దాదాపు 30% కంప్లీట్ అయిందంటూ ఊదరగొట్టారు మేకర్స్.ఆ లెక్కన సినిమా ఎలా చూసినా ఈ ఏడాదిలోనే రావాలి అన్నది ఆడియన్స్ వాదన.కాని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్స్ బట్టి సినిమా ఏప్రిల్ 2027 నాటికి కానీ షూటింగ్ కంప్లీట్ కాదని సమాచారం.అవును..ప్రభాస్ స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నందువల్లె కల్కి 2 సినిమాకి అనుకున్నట్టుగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడట.అంటే అప్పటిదాకా కల్కి2 గురించి వచ్చే అప్ డేట్స్ తోనే డార్లింగ్ ఫ్యాన్స్ సర్డుకుపోవాలన్న మాట.

also read :వరల్డ్ కప్ స్టేజ్ పై నోరా పెర్ఫార్మెన్స్..ఫిఫా వేడుకల్లో అరుదైన రికార్డు!

Advertisement

vfx కోసం ఏకంగా 8నెలలు

దీనికి తోడు సినిమా షూట్ కంప్లీట్ అయినతర్వాత కూడా సినిమాలోని vfx (విజువల్ ఎఫెక్ట్స్)కోసం ఏకంగా 8నెలలు తీసుకోబోతున్నారట.ఏది ఎలా ఉన్నా సినిమా కి మాత్రం హాలీవుడ్ రేంజ్ అవుట్ పుట్ కావాలని ఆశ పడుతున్నాడట డైరెక్టర్ నాగీ. అయితే ఇలాగే vfx విషయంలో హాలీవుడ్ హాలీవుడ్ అంటూ వచ్చిన ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ ని ఏ రేంజ్ లో డిసప్పాయింట్ చేసిందో తెల్సిందే.అచ్చం అలాగే ఊహకందని బడ్జెట్, అద్భుతమైన గ్రాఫిక్స్ అంటూ చివరికి వచ్చే ఏడుకి సినిమాని పోస్ట్ పోన్ చేయడంతో పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

మరో వైపు ‘అవెంజర్స్’ రేంజ్ సినిమా అని బిల్డప్

ఒకవేళ ‘కల్కి 2’ గనుక వినిపిస్తున్నట్టుగా వచ్చే ఏడు డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయితే అది ,ప్రభాస్ లైనప్ లో ఉన్న ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ వంటి సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.అదే జరిగితే మాత్రం ట్రేడ్ వర్గాల లెక్కల్లో భారీ తేడాలు రావడం ఖాయం.మరో వైపు ‘అవెంజర్స్’ రేంజ్ సినిమా అని బిల్డప్ ఇస్తున్నాడు డైరెక్టర్ నాగ్ ఆశ్విన్. కానీ, ఇలాగే సినిమా వాయిదాల పాట పాడుకుంటూ పొతే మాత్రం సినిమా మీద హైప్ తగ్గే అవకాశాలు పుష్కలం.పైగా ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తె 2027 డిసెంబర్ నాటికి ఆడియన్స్ టేస్ట్ మారిపోవచ్చు కూడా.చూడాలి మరి ఆడియన్స్ మనసుని అర్థం చేసుకుని సినిమాని త్వరగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారా..లేక వినిపిస్తున్నట్టుగా వచ్చే ఏడుకి పోస్ట్ పోన్ చేసుకుపోతారా!

also read :విజయ్ వాహనం ఏదైనా.. నంబర్ మాత్రం ‘0277’.. ఎందుకంటే?

 

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×