E-Paper
Advertisement

Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!

Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
Advertisement

ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి వచ్చిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వాటి విలువ సుమారు రూ. 9400 కోట్లకు పైమాటే. ముందుగా హెచ్ఐసీసీలో వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు. అంతకుముందు హెఐసీసీలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. ముందుగా సీఎం మాట్లాడుతూ.. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో సహాయసహకారాలు అందించారని, మన్మోహన్ స్ఫూర్తితో ప్రస్తుత ప్రధాని మోడీ సైతం తెలంగాణకు పెద్దఎత్తున నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు, నిధులు కావాలని కోరారు.

మేరే సే జోడో రేవంత్..

రేవంత్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను అని అంటున్నారు. తాను కూడా అదే చెబుతున్నాను. తనకు రాజకీయాల కంటే అభివృద్ది ముఖ్యమని పేర్కొన్నారు. మన్మోహన్ హయాంలో ఉమ్మడి ఏపీకి రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.వెయ్యి కోట్లు ఇస్తే తాను.. రూ.5,500 కోట్లు ఇచ్చానని.. రాజకీయాలకు పోతే అందులో సగం కూడా వచ్చేది కాదని పేర్కొన్నారు. మాటల్లో భాగంగా.. ‘మేరే సే జోడో’ మాతో కలిసి చూడు.. మీరు ఎక్కడి వరకు వెళ్లాలనుకుంటున్నారో అక్కడకు తీసుకెళ్తానని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. అయితే, ఇందులో నిగూడార్థం ఉందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ విడిచి బీజేపీతో దోస్తీ చేయాలని ప్రధాని మోడీ.. సీఎం రేవంత్‌కు ఆఫర్ ఇచ్చారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

రేవంత్ ఝలక్..

Advertisement

మోడీ ఇచ్చిన ఆఫర్‌తో ఈ టర్ము పూర్తయ్యాక రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండగా.. రేవంత్ మాత్రం అటు మోడీకి..ఇటు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి షాక్ ఇచ్చారు. కేంద్రసహాయ మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.ఈ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బీ టీమ్ అని.. అందుకే చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో బండి తనయుడి విషయంలో సీఎం రేవంత్ ఎట్టకేలకు స్పందించారు. ఈ కేసు విచారణను పారదర్శకంగా జరపాలని, అందుకోసం ప్రత్యేకంగా సిట్ విచారణకు ఆదేశించారు.

తమిళనాడు సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? సినిమా అంత కాదండోయ్, కాకపోతే ఆ సదుపాయాలే వేరు

Advertisement

ఈ కేసు విషయంలో విచారణ ఎందుకు ఆలస్యం అయ్యిందని డీజేపీ సీవీ ఆనంద్ మీద సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం. అయితే, ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలిస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైందని ఆయన వివరించినట్టు తెలిసింది.కాగా, బండి సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదు అయినందున వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గొద్దని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, కేంద్రమంత్రి తనయుడిపై మైనర్ మీద లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, ఇదంతా కావాలని ఓ ప్లాన్ ప్రకారం జరుగుతోందని.. హనీ ట్రాప్‌లో భాగమే ఇదంతా అని కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. మోడీ ఆఫర్ ఇస్తే సీఎం రేవంత్.. బండి సంజయ్ కుమారుడి కేసులో విచారణకు ఆదేశించి కేంద్ర, రాష్ట్ర బీజేపీకి ఝలక్ ఇచ్చారనే చర్చ జరుగుతున్నది.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×