E-Paper
Advertisement

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య
Advertisement

Vijay Sai Reddy: వైసీపీ బహిష్కృత నేత విజయసాయిరెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. జూన్‌లో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారా? కొత్తగా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారా? ఈ విషయంలో ఆయన గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాకపోతే ఏపీలో మూడో ప్రత్యామ్నాయం పార్టీ కావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు.

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు

Advertisement

ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరమని కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్ర రాజకీయాలు రెండు విచిత్ర‌ ధోరణుల మధ్య ఇరుక్కుపోయాయని మనసులోని మాట బయట పెట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

టీడీపీ-వైసీపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎంపీ. తొలి గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసే టీడీపీ పట్టణ-కేంద్రీకృత దృక్పథమని అన్నారు. రెండోది అభివృద్ధిపై దార్శనికత లేని వైసీపీ, కేవలం సంక్షేమ విధానమన్నారు. ఈ రెండు ధోరణుల మధ్య ఏపీ రాజకీయాలు నలిగిపోతున్నాయని ఆయన మాట.

Advertisement

మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

అదే సమయంలో ఏపీకి ఎలాంటి నాయకత్వం అవసరం అన్నది స్పష్టం చేశారు వీఎస్ఆర్. అభివృద్ధి-సంక్షేమాలను సమన్వయం చేసే విశ్వసనీయమైన మూడో ప్రత్యామ్నాయం కావాలన్నారు. ఓవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. వాటి ఫలాలను రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి చేరేలా చూసే నాయకత్వం రావాలన్నారు.

అన్నట్టు విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ పెడతానని గతంలో సూచనప్రాయంగా చెప్పారు. దానికి సపోర్టుగా న్యూస్ ఛానెల్ పెడతానని చెప్పారు. అందుకు జూన్ నెల ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదుగానీ మూడో ప్రత్యామ్నాయం అంటూ కొత్త పలుకులు మొదలుపెట్టారు.

ఇంతకీ విజయసాయరెడ్డి పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఎప్పుడంటూ ఎక్స్ వేదికగా ఆయన హార్డ్ కోర్ అభిమానులు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.  లేకుంటే సోషల్ మీడియా ద్వారా తన పార్టీకి హైప్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

ALSO READ: మరోసారి చంద్రబాబు సాయం తీసుకోనున్న మోడీ!

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×