Kalpika Ganesh: కల్పిక గణేష్(Kalpika Ganesh) ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాలలో నిలుస్తున్న పేరు. నటిగా పలు సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించిన ఈమె సినిమాలలో నటించడం కంటే కూడా వివాదాల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా కల్పిక ఎక్కడికైనా బయటకు వెళ్ళింది అంటే కచ్చితంగా అక్కడ గొడవ జరుగుతుంది. ఇలా గొడవ పడటానికి కారణం లేకపోలేదని చెప్పాలి. అందరి అటెన్షన్ కోసమే తాను గొడవ పడతాను అంటూ పలు సందర్భాలలో స్వయంగా కల్పిక ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇటీవల ప్రిజంపబ్ (Prisam Pub) యాజమాన్యంతో గొడవకు దిగారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఈమెపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.
వివాదాలకు కేరాఫ్ కల్పిక…
ఇక గత కొద్ది రోజుల క్రితం ఓ రిసార్ట్ లో కూడా ఈమె పెద్ద ఎత్తున గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఇలా తరచూ వివాదాలలో నిలుస్తున్న ఈమె ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కల్పిక సంచలనమైన విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవ ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవకు ఎలాంటి కారణం లేదని ఆ కేక్ గురించి కాంప్లిమెంటరీ అడగడం వల్లే గొడవ జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
రే**చేస్తామని బెదిరించారు…
ఇక ప్రిజం పబ్ యాజమాన్యం మీపై ఏమైనా దాడి చేసిందా? లేదంటే ఏదైనా వాడుకూడని పదాలు మాట్లాడారా? అంటూ మరొక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నన్ను రే*చేస్తానని బెదిరించారని ఈ సందర్భంగా కల్పిక ఆ గొడవ గురించి తెలియజేశారు. మీరు ప్రతిరోజు అదే పని చేసే డబ్బు సంపాదిస్తారు కదా అంటూ చాలా దారుణంగా మాట్లాడారని తెలియజేశారు. మిమ్మల్ని ప్రిజం పబ్ యాజమాన్యం రే*చేస్తానని బెదిరించడం ఏంటి? అసలు మీకు ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? అంటూ మరో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ తెలుసు ఆల్రెడీ నాపై రే జరిగిందంటూ సంచలన విషయాలను బయట పెట్టడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కల్పిక పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి…
ఇలా కల్పిక ఎక్కడికి వెళ్లిన ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈమె మెంటల్ హెల్త్ బాగా లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఇటీవల ఆమె తండ్రి గణేష్ స్వయంగా తన కుమార్తె పై పోలీస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తె గత కొన్ని సంవత్సరాల నుంచి మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని పూర్తిగా డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయిందని తెలిపారు. మందులు వాడుతున్నామని అయితే ఇటీవల మందులు వాడటం మానేసిందని వెల్లడించారు. ఇలా ఈమె మానసిక పరిస్థితి కారణంగానే బయటకు ఎక్కడికి వెళ్లినా గొడవ పడుతుందని తన కూతురి కారణంగా మా కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉందని ఈయన పోలీసుల ఫిర్యాదులో తన కుమార్తె గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఆమె అలా ప్రవర్తిస్తుందని పలువురు ఈమె వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral Vayyari: వచ్చేసిన వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోందిగా!