ENG Vs IND 5th Test : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరి టెస్టు కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ భారత జట్టు 224 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ కి ఈ మాత్రం స్కోర్ చాలు అని అంతా భావించారు. కానీ ఇంగ్లాండ్ ఈ స్కోర్ ని ఈజీగా ఛేజింగ్ చేసేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులు మాత్రమే చేయడంతో.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అలాగే కట్టడి చేస్తామని భారత బౌలర్లు భావించారు. కానీ కొన్ని మిస్టేక్స్ చేయడంతో టీమిండియా మ్యాచ్ ను కోల్పోతుందనిపించింది. కానీ చివరికి 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇవాళ 35 పరుగులు ఛేదించలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు.
Also Read : IND Vs ENG 5th Test : సిరాజ్ బిగ్ మిస్టేక్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ముఖ్యంగా టీమిండియా బౌలర్ సిరాజ్ హ్యారీ బ్రూక్ క్యాచ్ విషయంలో కాస్త తొందర పడ్డాడనే చెప్పాలి. లేకుంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగేది కాదు. హ్యారీ బ్రూక్ సరిగ్గా 35వ ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మొదటి బంతిని బ్రూక్ హుక్ షాట్ ఆడగా.. బంతి నేరుగా డీప్ ఫైన్ లెగ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ చేతిలోకి వెళ్లింది. సిరాజ్ క్యాచ్‌ను సునాయాసంగా పట్టుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో పెద్ద పొరపాటు చేశాడు. తాను బౌండరీకి ఎంత దగ్గరగా ఉన్నాడో మర్చిపోయి, బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ అడుగు నేరుగా బౌండరీ లైన్‌ను తాకింది. దీంతో అతనికి లైఫ్ ఇచ్చినట్టు అయింది. 98 బంతుల్లో 111 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
టీమిండియా విజయం
మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటర్లలో క్రాలీ 14, బెన్ డకెట్ 54, పోప్ 27, జోరూట్ 105 సెంచరీతో ఆకట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ 111, బెథెల్ 5 పరుగులు చేశారు. ఇవాళ మ్యాచ్ ప్రారంభం కాగానే.. జెమీ స్మిత్ 2, ఓవర్టన్9, అట్కిన్సన్ 8 పరుగులు చేసి ఇవాళ ఔట్ అయ్యారు. అట్కిన్సన్ 17 పరుగులు చేసి గెలిపించేంత పని చేశాడు. కానీ సిరాజ్ వేసిన యార్కర్ కి బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 118 పరుగులు చేయగా.. ఆకాశ్ దీప్ 66 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ 53 పరుగులు చేయడం విశేషం. మరోవైపు చివర్లో వాషింగ్టన్ హాప్ సెంచరీ చేయకుంటే.. టీమిండియా ఆ స్కోర్ చేయకపోయి ఉండేది. జురెల్ 34, కరుణ్ నాయర్ 17, కెప్టెన్ శుబ్ మన్ గిల్ 11, సాయి సుదర్శన్ 11, కేఎల్ రాహుల్ 07 పరుగులు చేశారు. సిరాజ్ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 88 ఓవర్లలో 396 పరుగులు చేయగలిగింది. ఇవాళ సిరాజ్, ప్రసిద్ధ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది.