Viral Vayyari: ప్రముఖ పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు గాలి కిరీటి రెడ్డి(Gali Kireeti Reddy) సినిమాలపై ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో వారాహి చలనచిత్ర నిర్మాణ సంస్థలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “జూనియర్”(Junior) అనే సినిమా ద్వారా ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. గాలి కిరీటి రెడ్డికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమా కోసం బడా టెక్నీషియన్లు పనిచేశారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా శ్రీ లీల(Sreeleela) హీరోయిన్గా నటించి సందడి చేశారు.
వచ్చేసిన వైరల్ వయ్యారి..
ఇక ఈ సినిమా ద్వారా సీనియర్ నటి జెనీలియా (Genelia) రీ ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జూలై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి మంచి పాజిటివ్ సొంతం చేసుకుంది. ఇక కిరీటి రెడ్డి నటించిన మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను ప్రశంసలను సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సినిమాలో వైరల్ వయ్యారి సాంగ్(Viral Vayyari Song) ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట మారుమోగుతుంది.
డాన్స్ ఇరగదీసిన కిరీటి…
ఇకపోతే తాజాగా ఈ వైరల్ వయ్యారి పాటకు సంబంధించిన ఫుల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేశారు.4k వెర్షన్ లో ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేయడంతో ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ పాట లిరికల్ సాంగ్ విడుదలైనప్పుడే ఎంతో మంచి ఆదరణ లభించడమే కాకుండా చాలామంది ఈ పాటకు రీల్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు. తాజాగా వీడియో సాంగ్ విడుదల చేయడంతో కిరీటి రెడ్డి డాన్స్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రీ లీలను సైతం డామినేట్ చేస్తూ ఈయన నటించారంటూ ప్రశంసిస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి.
ఇక జూనియర్ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో కాలేజ్ స్టూడెంట్ గా కిరీటి కనిపించారు. ఇక మొదటి సినిమాతోనే ఈయన తన నటనతో గాని డైలాగు డెలివరీ కానీ, యాక్షన్ సన్నివేశాలలో కూడా ఎంతో అనుభవం ఉన్న నటుడి తరహాలో నటించారని తెలుస్తోంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న కిరీట్ రెడ్డి తదుపరి ఎలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఈయన తన సెకండ్ సినిమా గురించి ఎలాంటి ప్రకటనలు రాలేదు. ప్రస్తుతం రెండో సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి వైరల్ వయ్యారి లిరికల్ వీడియో సాంగ్ రావడంతో ఈ పాటకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో సాంగ్ పై ఓ లుక్ వేసేయండి.
Also Read: Coolie pre Release: టాలీవుడ్ హీరోల నుంచి వాటిని దొంగలిస్తా అంటున్న శృతి.. ఏమైందంటే?