E-Paper
Advertisement

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’
Advertisement

Kalyanam Kamaneeyam Jeevitham Trailer:చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ సమయంలో అదే బాటలో ఆడియన్స్ ని అలరించేందుకు మరో సినిమా సిద్దమైంది. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”.

రవి లోకిరెడ్డి దర్శకత్వంలో నిర్మాతలు పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల ఈ చిత్రాన్ని నిర్మించారు. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

Advertisement

ఇక తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రముఖ నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, కూనిరెడ్డి శ్రీనివాస్, అయోధ్యకుమార్ ప్రత్యేక అతిథులుగా వచ్చి మూవీ టీమ్ కు తమ బెస్ట్ విషెస్ అందించారు.

వి.వి. వినాయక్ మాట్లాడుతూ

Advertisement

ఈ ఈవెంట్‌లో దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ప్రసాద్ రావు, కిషోర్ గారు ఈ సినిమాను నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ట్రైలర్ చాలా బాగుందని, డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ ద్వారా వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ సాధించి, ఇందులో పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్లకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.

అలాగే సీనియర్ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ఇలాంటి ప్యాషనేట్ నిర్మాతలు ఎంతో అవసరమని, కంటెంట్ బాగుంటే ఆడియన్స్ తప్పకుండా థియేటర్లకు వస్తారని చెప్పారు.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

చిత్ర నిర్మాతలు పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల మాట్లాడుతూ.. తాము అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో సెటిల్ అయినా, సినిమాపై ఉన్న ప్యాషన్‌తోనే గతంలో ’24 కిస్సెస్’, ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. మన చుట్టూ ఉండే సమాజంలో ఒక భార్యాభర్తల జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ దంపతులు తమ బంధాన్ని కాపాడుకోవడానికి ఎలా పోరాడారు? అనే కథతో ఈ సినిమానుతీసినట్టు చెప్పారు.

కుటుంబమంతా కలిసి ప్రశాంతంగా చూసేలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ రవి లోకిరెడ్డి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చూస్తుంటే ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చడం పక్కా అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.

దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ

ఇక ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న ఖాన్ దురాని మాట్లాడుతూ.. తాను కెమెరామెన్‌గా వర్క్ చేస్తూనే సినిమాపై ఉన్న ప్రేమతో యాక్టింగ్, ఎడిటింగ్, కలరింగ్ నేర్చుకుని హీరోగా మారానని తెలిపారు.

హీరోయిన్ సాహితి ఆవంచ, దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. రచయిత అరవింద్ ఇచ్చిన ఒక మంచి ఐడియాను నమ్మి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారని చెప్పారు. స్టార్ మేకర్ సత్యానంద్ గారు ఇందులో ఒక పవర్ ఫుల్ రోల్ చేశారని, అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని తెలిపారు.

ALSO READ:వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణం పోశాయని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఎన్ సీ అరవింద్ ఏకలవ్య ఈ చిత్రానికి డైలాగ్స్ రాయగా అందించగా, వెంకటరాజు డి కెమెరామెన్‌గా పనిచేశారు. మంచి లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమాను ఈనెల 18న థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరింది మూవీ టీమ్.

Tags

Related News

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×