E-Paper
Advertisement

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో
Advertisement

Korean Romantic Family Drama: ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కానీ పరిస్థితులు మాత్రం వాళ్లిద్దరినీ ఒకే ఇంట్లో కలిసి ఉండేలా చేస్తాయి. అది కూడా ఓ చిన్న బాబును పెంచడం కోసం. మొదట గొడవలతో మొదలైన ఈ ప్రయాణం చివరికి ప్రేమగా మారితే ? తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి ఈ ఇద్దరి జీవితాలను ఎలా మార్చాడు ? ఈ ఎమోషనల్ జర్నీని చూపించే కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సిరీసే ‘Our Universe’ (2026). మరి ఈ సిరీస్ ఓటీటీలో తెలుగులో ఉందా లేదా అనేది తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం.

కథలోకి వెళ్తే…

సన్ టే-హ్యుంగ్ ఫొటోగ్రఫీ రంగంలో పని చేస్తూ తనకంటూ ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనుకునే వ్యక్తి. మరోవైపు వూ హ్యున్-జిన్ చాలా ప్రాక్టికల్‌ గా, బాధ్యతగా ఉండే యువతి. వీరిద్దరి కుటుంబాల మధ్య ఉన్న బంధం కారణంగా ఒకరికొకరు ఇన్-లాస్ అవుతారు. కానీ మొదటి పరిచయం మాత్రం అస్సలు సాఫీగా ఉండదు. ఒక ఆన్‌లైన్ సెకండ్‌ హ్యాండ్ మార్కెట్‌ ప్లేస్ ద్వారా వీళ్ల పరిచయం గొడవతో మొదలవుతుంది. చిన్న విషయాలకే అపార్థాలు పెరుగుతాయి. ఒకరిని మరొకరు ఇష్టపడకపోవడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది.

Advertisement

అయితే ఓ విషాదకరమైన కారు ప్రమాదం వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తుంది. టే-హ్యుంగ్ సోదరుడు, హ్యున్-జిన్ సోదరి ఇద్దరూ ఈ ప్రమాదంలో చనిపోతారు. దీంతో వారి 20 నెలల చిన్నారి వూ-జు అనాథగా మిగులుతాడు. ఆ చిన్నారిని వేరే వాళ్లకు అప్పగించడానికి ఇద్దరికీ మనసు ఒప్పుకోదు. దీంతో ఒకరినొకరు ఇష్టపడకపోయినా కలిసి వూ-జును పెంచాలని నిర్ణయించుకుంటారు. చివరకు ఒకే ఇంట్లో కలిసి ఉండటం మొదలుపెడతారు. చిన్నారిని చూసుకోవడం ఇద్దరికీ కొత్త అనుభవమే. నిద్ర పుచ్చడం నుంచి తినిపించడం వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

కానీ వూ-జు కోసం కలిసి గడిపే సమయం పెరిగే కొద్దీ వాళ్ల మధ్య ఉన్న అపార్థాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. అంతేకాదు బాబును పెంచే బాధ్యతలో ఇద్దరూ తమ గతంలోని బాధలను కూడా ఎదుర్కొంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాల్లో తోడుగా నిలుస్తూ క్రమంగా దగ్గరవుతారు. తమకు తెలియకుండానే ఆ అనుబంధం ప్రేమగా మారుతుంది. మరి ఆ ప్రేమకథ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది ? పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన ఆ హీరోహీరోయిన్ చివరికి ఒక్కటయ్యారా లేదా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి. ఆ ఫ్యామిలీ కుటుంబం అంటే కేవలం రక్తసంబంధం మాత్రమే కాదని, కలిసి పంచుకునే ప్రేమ కూడా ఒక కుటుంబాన్ని తయారు చేస్తుందని ఈ కథ చెబుతుంది.

ఓటీటీలో ఎలా చూడొచ్చు ?

Advertisement

‘అవర్ యూనివర్స్’ సిరీస్ లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు ఆడియోతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఈ సిరీస్ ను చూడొచ్చు. గొడవలతో మొదలై, బాధ్యతగా మారి, చివరికి ప్రేమగా మారే కథలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి ఫీల్-గుడ్ వాచ్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా చిన్నారి చుట్టూ సాగే ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్, కామెడీ, రొమాన్స్ కలయిక ఈ సిరీస్‌ లో హైలెట్.

Read Also: అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

Related News

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 లిస్ట్… మొత్తం సిరీస్లదే హంగామా

Big Stories

Advertisement
×