E-Paper
Advertisement

Romantic Action Thriller : లోయలో లవ్.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే బెస్ట్ యాక్షన్ మూవీ ఇది, డోన్ట్ మిస్

Romantic Action Thriller : లోయలో లవ్.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే బెస్ట్ యాక్షన్ మూవీ ఇది, డోన్ట్ మిస్
Advertisement

Romantic Action Thriller : యాక్షన్, రొమాన్స్, హారర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ ఓటీటీలో మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పుకోనివ్వదు. ఒక భయంకరమైన లోయను కాపలా కాసే జంట చుట్టూ కథ ఉంటుంది. ఆ లోయ లోపల నుండి మానవాళికి పెను ముప్పు ఉందని తెలిసినప్పుడు అసలు కథ ఉంటుంది. ఈ సీన్స్ కి ఒళ్లు జలదిరించడం పక్కా. అయితే కొంత రొమాంటిక్ సీన్స్ ఉపశమనం ఇస్తాయి ఆడియన్స్ కి. మరి ఈ సినిమా పేరు, ఎక్కడ చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

‘ది గార్జ్’ (The Gorge) 2025లో విడుదలైన ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో మైల్స్ టెల్లర్, అన్యా టేలర్-జాయ్, సిగౌర్నీ వీవర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా నేరుగా Apple TV+ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఇది తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లెవీ (మైల్స్ టెల్లర్), డ్రాస్ (అన్యా టేలర్-జాయ్) అనే ఇద్దరు స్నిపర్లు ఒక భారీ లోయకు రెండు వైపులా ఉన్న టవర్లలో కాపలా ఉంటారు. ఆ లోయ మధ్యలో ఉన్న ఒక పెద్ద గోడను ఎవరూ దాటకుండా చూడటమే వాళ్ళ పని. వీళ్ళు ఒకరినొకరు చూసుకోలేకపోయినా, రేడియో ద్వారా మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఇష్టపడతారు. అయితే అసలు ఆ లోయ లోపల ఏముంది? తాము దేని నుండి రక్షణ కల్పిస్తున్నాం? అనే నిజం తెలియకుండానే వాళ్ళు సంవత్సరాల తరబడి అక్కడ గడుపుతారు.

కానీ ఒక్కసారిగా ఆ లోయ లోపల ఉన్న ఒక రహస్యమైన రాక్షస శక్తి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ గోడ వెనుక ఉన్న భయంకరమైన నిజం వాళ్ళకి తెలుస్తుంది. తాము ప్రాణంగా ప్రేమించుకుంటున్న వ్యక్తిని కాపాడుకోవడమా ? ప్రపంచాన్ని రక్షించడమా అనే పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారు? ఆ లోయ లోపల ఉన్న భయంకరమైన జీవులను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×