E-Paper
Advertisement

Film industry: రోజుకు 15 కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డు!

Film industry: రోజుకు 15 కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డు!
Advertisement

Film industry:కల్కి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ), దీపికా పదుకొనే (Deepika Padukone) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీ కురిపించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమలహాసన్, దిశాపటానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు స్థాయిలో వసూలు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

అబ్బురపరిచే రెమ్యూనరేషన్..

ఇకపోతే ఈ సినిమాలో ఎక్కువ భాగం నటీనటుల రెమ్యూనరేషన్ కే సరిపోయిందనే వార్త అప్పట్లో భారీగా చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి తారలు ఒక్కొక్కరు రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ కమలహాసన్ మాత్రం ఏకంగా హీరో ప్రభాస్ కి దరిదాపుల్లో రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. అయితే యుగి సేతు మాత్రం అంతకుమించి పారితోషకం తీసుకున్నాడు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రోజుకు రూ.15 కోట్లు..

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా యుగి సేతు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” కమల్ హాసన్ కల్కి సినిమాలో 20 రోజుల కాల్ షీట్లకు ఏకంగా 150 కోట్లు తీసుకున్నారు. ఆయన దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడు అని , కమలహాసన్ బర్త్ డే రోజే చెప్పాను . ఒకసారి కల్కి నిర్మాత అశ్విని దత్ ను కలిసి నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు ధన్యవాదాలు సార్ అని చెప్పాను.. 20 రోజులకి 150 కోట్లు ఇచ్చారు అంటే మామూలు విషయం కాదు అన్నాను.. వెంటనే అశ్వినీ దత్ కలగజేసుకొని నాకు 20 రోజులు ఎక్కడ ఇచ్చారు.. పది రోజులు మాత్రమే.డేట్స్ ఇచ్చారు అని చెప్పాడు. అప్పటిదాకా కమల్ రోజుకి 8 కోట్లు సంపాదించాడు అనుకున్నాను . కానీ రోజుకి 15 కోట్లు ఇచ్చారని ఆ తర్వాతే తెలిసింది” అంటూ యోగి తెలిపారు.

ALSO READ:Anchor Rashmi:నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. ప్రూఫ్స్ కావాలంటూ కౌంటర్!

కమల్ హాసన్ రేంజ్ అదుర్స్..

Advertisement

మొత్తానికైతే రోజుకి 15 కోట్ల చొప్పున 10 రోజులకి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కమలహాసన్ రేంజ్ ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపితమయింది అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే యాష్కిన్ పాత్రలో కమలహాసన్ నటన అద్భుతం అనే చెప్పాలి.. ఇక ఈ సీక్వెలలో ఆయన అంతకుమించి నటించబోతున్నారని సమాచారం. లోక నాయకుడిగా విభిన్న గెటప్స్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగిన ఏకైక నటుడిగా కమలహాసన్ రికార్డు సృష్టించారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి.. మేకప్ వేసుకుంటే తాను కాదేమో అని నిరూపించేలా అందరిని అబ్బుర పరుస్తున్నారు. మరి ఈ యాస్కిన్ కల్కి2లో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×