E-Paper
Advertisement

Psychological Drama OTT: ఇంట్లోనే మాటు వేసే మొగుడు… భార్య చేసే పనులకు ఫ్యూజులు అవుట్

Psychological Drama OTT: ఇంట్లోనే మాటు వేసే మొగుడు… భార్య చేసే పనులకు ఫ్యూజులు అవుట్
Advertisement

Psychological Drama OTT : భూమి మీద రకరకాల మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. అయితే మామూలు మనుషుల వల్ల మిగతా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా, కొంతమంది సైకోలతోనే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. అదే ఇంట్లో వాళ్ళే అలా ప్రవర్తిస్తుంటే ఆ బాధను వర్ణించలేము కూడా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీలో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉన్న భర్త వల్ల భార్య ఇబ్బంది పడుతుంది. అతను దాదాపు ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే మాటువేసి భార్యను గమనిస్తుంటాడు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ డ్రామా మూవీ పేరు ‘వేక్‌ఫీల్డ్’ (Wakefield). దీనిని రాబిన్ స్వికార్డ్ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో బ్రయాన్ క్రాన్స్‌టన్, జెన్నిఫర్ గార్నర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇ.ఎల్. డాక్టోరో రాసిన ఒక చిన్న కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం 2016 సెప్టెంబర్ 2న టెల్లూరైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. 2017 మే 19న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఇది Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హోవార్డ్ అనే ఒక పెద్ద లాయర్ మంచి లైఫ్ అనుభవిస్తుంటాడు. మంచి పెళ్ళాం, పిల్లలు, పైసా.. అన్నీ ఉన్నా లోపల ఏదో వెలితి. ఒకరోజు రాత్రి ఆఫీసు నుండి ఇంటికి వస్తూ, సడన్‌గా మైండ్ బ్లాక్ అయ్యి తన ఇంటి గ్యారేజీ పైన ఉండే అటక మీద దూరి కూర్చుంటాడు. పెళ్ళానికి ఫోన్ చేయడు, ఇంట్లోకి వెళ్ళడు. అలా అని ఊరు విడిచి కూడా పోడు. ఆ చిన్న అటకలో ఉండి, కిటికీలోంచి తన పెళ్ళాం పిల్లలు తను లేక ఏడుస్తున్నారా లేక ఎంజాయ్ చేస్తున్నారా అని దొంగచాటుగా గమనిస్తుంటాడు. రోజులు గడిచేకొద్దీ మురికి పట్టిన గడ్డంతో పిచ్చోడిలా తయారవుతాడు. తిండి కోసం, ఇంట్లో వాళ్ళు నిద్రపోయాక దొంగలా లోపలికి వెళ్లి ఏమైనా తిని రావడం చేస్తుంటాడు. బయట ప్రపంచానికి అతను చచ్చిపోయాడో లేక ఎవరినైనా లేపుకుపోయాడో అర్థం కాదు. అయితే అతను మాత్రం ఆ చీకటి గదిలో కూర్చుని, తన పెళ్ళాంను గమనిస్తూనే ఉంటాడు.

హోవార్డ్ కనిపించలేదని , అతని భార్య డయానా ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు, ఆమె పాత ప్రియుడు డిర్క్ మళ్ళీ ఆమె జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. హోవార్డ్ వీరిద్దరినీ గమనిస్తూ విపరీతమైన అసూయకు గురవుతాడు. నిజానికి డయానాను డిర్క్ నుండి హోవార్డే అబద్ధాలు చెప్పి తన వైపు తిప్పుకుంటాడు. అందుకే ఆమె మళ్ళీ అతని దగ్గరకు వెళ్తుందేమో అని భయపడతాడు. అనుకున్నట్లే డయానా, డిర్క్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆతరువాత కథ ఆసక్తికర మలుపు తీసుకుంటుంది. చివరికి ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? ఆమె ఎవరితో జీవితం పంచుకుంటుంది ? అసలు భర్త వచ్చాక డయానా రియాక్షన్ ఏమిటి ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మొగుళ్ళకి తెలీకుండా తప్పుడు పని… మర్డర్ తో మైండ్ బ్లాక్ ట్విస్ట్… క్లైమాక్స్ కెవ్వు కేక

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×