E-Paper
Advertisement

రాహుల్ గాంధీతో పెళ్లా? కంగనా రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!

రాహుల్ గాంధీతో పెళ్లా? కంగనా రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

kangana ranaut-rahul gandhi : నిజం గడపదాటే లోపే అబద్దం ఊరంతా తిరిగొస్తుంది…ఈ సామెతని మరోసారి ప్రూవ్ చేస్తుంది సోషల్ మీడియా.హీరో హీరోయిన్స్ బయట కాస్త క్లోజ్ గా మూవ్ అయితే చాలు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఊదరగొట్టేస్తుంటారు నెటిజన్లు.ఇక పలుమార్లు కలిసి కనిపిస్తే చాలు పెళ్లి పీటలెక్కేస్తున్నారు అంటూ వార్తలు వండి వార్చేస్తారు.కానీ అసలెలాంటి క్లూ లేకుండానే లేటెస్ట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి వస్తున్న ఒక క్రేజీ రూమర్ ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రాహుల్ గాంధీ – కంగనా పెళ్లి.. అసలేం జరుగుతోంది?

Advertisement

బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో గత కొన్ని రోజులుగా ఒక గాసిప్ బాగా చక్కర్లు కొట్టేస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నటి కంగనా రనౌత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని,పై పెచ్చు రాహుల్ గాంధీనే స్వయంగా కంగనాకు ప్రపోజ్ చేశారని వినిపిస్తున్న వార్త. అంతే కాదండోయ్..కంగనా కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా’యస్’ చెప్పేసిందట.అసలే రాహుల్ కాంగ్రెస్ పార్టీ, కంగనా బిజేపీ పార్టీ.అలాంటిది వీళ్ళిద్దరికీ ఎలా కుదురుతుందన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.కానీ ఇవేవీ ఆలోచించకుండా ఇద్దరికీ పెళ్లి జరగబోతుందన్న వార్తలు తెగ సర్క్యులేట్ కావడమే కాస్త ఆశ్చర్యం.

నిప్పులు చెరిగిన కంగనా.. సిగ్గుండాలి మీకు

Advertisement

సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు. కానీ, కంగనా రనౌత్ స్టైలే వేరు. ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఈ అమ్మడు తనపై వచ్చిన ఎలాంటి రూమర్స్ ని అయినా గట్టిగానే తిప్పి కొడుతుంది.ఇదే క్రమంలో ఇక తాజాగా తనపై వస్తున్న ఈ పెళ్లి పుకార్లపై ఒక్కసారిగా ఫైర్ అయిపొయింది.తన సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ”ఇలాంటి అసత్య వార్తలు పుట్టించే వారికి కనీసం సిగ్గుండాలి. కేవలం సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఒకరి పేరును ఇలా నీచంగా వాడడం బాధ్యతారాహిత్యం. నా పేరును ఇలాంటి పనికిమాలిన వార్తల్లోకి లాగడం ఒక నీచమైన చర్య” అంటూ తనదైన శైలిలో మండిపడింది.ఇప్పుడే కాదు గతంలో హృతిక్ రోషన్,ఆదిత్య పంచోలితో కాంట్రవర్సీ ఎదురైనప్పుడు కూడా ఎక్కడ తగ్గలేదు ఈ వెటరన్ బ్యూటీ.

also read :జయసుధ ఒకలా.. జయప్రద మరోలా.. సీనియర్ హీరోయిన్ల గురించి మోహన్ బాబు ‘ఓపెన్’ స్టేట్‌మెంట్!

వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా?

ఇక గత కొంతకాలంగా క్లిక్ బైట్ థంబ్ నెయిల్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగడం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసింది కంగనా.”ఈ పుకార్లు నన్నే కాదు, అవతలి వ్యక్తి గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇలాంటి వార్తలు రాయడం వల్ల ఆ వ్యక్తులు ఎంతటి మెంటల్ టార్చర్ అనుభవిస్తారో వాళ్లకి అవసరం లేదు.దయచేసి అఫీషియల్ గా నేను ఏ విషయమైనా అనౌన్స్ చేసేవరకు ఇలాంటివి అస్సలు నమ్మొద్దు అంటూ తన అభిమానులకి కోరుతుంది.

లీగల్ యాక్షన్ వార్నింగ్!

ఇక ఇలాంటి ఫేక్ న్యూస్ తో తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా న్యూస్ పబ్లిష్ చేస్తే అస్సలు ఊరుకోనని , అవసరం అయితే ఇలాంటి ఫేస్ న్యూస్ లని సర్క్యులేట్ చేసే వెబ్ సైట్లపై, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏ మాత్రం తగ్గనని తేల్చి చెప్పింది.మొత్తానికి సర్క్యులేట్ అవుతున్నట్టుగా రాహుల్ గాంధీతో పెళ్లి అనే వార్త ఒక రూమర్ మాత్రమే అని,అసలిందులో నిజమేమీ లేదని కంగనా కౌంటర్ తో తేలిపోయింది.చూడాలి మరి ఫైర్ బ్యాండ్ చూపించిన ఫైర్ తో అయినా ఇలాంటి గాసిప్పులకి బ్రేకులు పడతాయేమో !

also read :సినిమా రీల్ నుంచి రియల్ పాలిటిక్స్ వరకు.. విజయ్-త్రిష అన్స్టాపబుల్ కెమిస్ట్రీ

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×