E-Paper
Advertisement

జయసుధ ఒకలా.. జయప్రద మరోలా.. సీనియర్ హీరోయిన్ల గురించి మోహన్ బాబు ‘ఓపెన్’ స్టేట్‌మెంట్!

జయసుధ ఒకలా.. జయప్రద మరోలా.. సీనియర్ హీరోయిన్ల గురించి మోహన్ బాబు ‘ఓపెన్’ స్టేట్‌మెంట్!
Advertisement

Mohan Babu : నా రూటే సెపరేటు అంటూ ఎవరేం అనుకున్నా మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు బయటపెట్టేస్తాడు మోహన్ బాబు. ఇదే క్రమంలో తాజాగా జరిగిన ‘డైరెక్టర్స్ డే’ (మే 4, 2026)వేడుకల్లో కూడా మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతున్నాయ్.ముఖ్యంగా తనతో నటించిన జయప్రద, జయసుధ పై ఈ కలెక్షన్ కింగ్ చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయ్.

జయసుధ నా సోదరి.. కానీ జయప్రద మాత్రం కాదు!

Advertisement

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా జరిగిన ఈ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు.స్టేజ్ మీద జయసుధ, జయప్రద పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.అదే సమయంలో మైక్ అందుకున్నమోహన్ బాబు “జయసుధ నాకు సోదరి వంటిది.. కానీ జయప్రద మాత్రం నా సోదరి కాదు” పెద్ద బాంబే పేల్చాడు.ఈ మాట వినగానే ఒక్కసారిగా హాల్ లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. జయప్రద కూడా వెంటనే రియాక్ట్ అవుతూ “ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు మీరు?” అని సరదాగా నిలదీసింది కూడా.అయితే వెంటనే రియాక్ట్ అయిన మోహన్ బాబు నవ్వుతూ అసలు విషయం చెప్పేశాడు. వారిద్దరి మధ్య ఉన్న చనువుని,ఆ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అసలు విషయాన్ని రివీల్ చేసుకొచ్చాడు.

also read :సినిమా రీల్ నుంచి రియల్ పాలిటిక్స్ వరకు.. విజయ్-త్రిష అన్స్టాపబుల్ కెమిస్ట్రీ

Advertisement

నాడు ఏవీఎం స్టూడియోలో ఏం జరిగింది?

చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో దర్శకరత్న దాసరి డైరెక్షన్ లో కృష్ణంరాజు, జయప్రద జంటగా ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది.అదే షూటింగ్ లో నేను కూడా ఆ సినిమాలో ఉన్నాను. ఉదయం 7 గంటలకు మొదలైన షూటింగ్ మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు జరిగింది. సీన్ ప్రకారం నేను జయప్రదను లాక్కెళ్లిపోవాలి. అప్పుడు అక్కడ ఉన్న లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య గారు నా దగ్గరకు వచ్చి.. ‘అయ్యా.. ఇంత అందమైన అమ్మాయిని అలా ఎలా లాక్కెళ్తారు? రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది కదా’ అని అడిగారు” అంటూ సరదాగా ఆనాటి కామెడీ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నాడు మన డైలాగ్ కింగ్.దీంతో స్టేజ్ మీద ఉన్న జయప్రదతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఘోల్లుమన్నారు.

హిట్ పెయిర్.. క్రేజీ కాంబినేషన్

ఇక మోహన్ బాబు, జయప్రద కాంబినేషన్ విషయానికి వస్తే వీరి కాంబోలో చాలానే సూపర్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980లో వచ్చిన ‘పాలు-నీళ్లు’ సినిమా వీరిద్దరి కెమిస్ట్రీకి, పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘ప్రతిధ్వని’ (1986) వంటి ఎన్నో సినిమాల్లో పోటీ పడి నటించి మెప్పించారు.సో ..అంత మంచి చనువు ఉందనే కారణంతోనే జయప్రదను తాను సోదరిగా అనుకోనని,తను ఎప్పటికీ క్రేజీ కో-స్టార్ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

భారీ విరాళం.. దర్శకులపై గౌరవం

ఇక ఇదిలా ఉంటె ఇదే ఈవెంట్ లో తన మంచి తనాన్ని చాటుకున్నాడు మన కలెక్షన్ కింగ్. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి తన వంతు సాయంగా ఏకంగా 15 లక్షలని విరాళంగా ప్రకటించడంతో దాసరి అంటే తనకి ఎంత ప్రేమో మరోసారి ప్రూవ్ చేశాడు.మొత్తానికి జయసుధను సోదరి అని, జయప్రదను కాదని మోహన్ బాబు చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయ్.

also read :విజయ్ బాటలో అల్లు అర్జున్ ..సీయం అవుతాడా ?

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

సర్జరీ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన రామ్ చరణ్.. డ్యాషింగ్ లుక్ తో!

ఆ సెలబ్రిటీల బాటలో శృతిహాసన్.. మరీ ఇంత దారుణంగా తయారయ్యారా?

ముంబై కోర్టును ఆశ్రయించిన శృతి హాసన్.. ఆ ఒక్కటి చేస్తే జైలుకే..!

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

Big Stories

Advertisement
×