E-Paper
Advertisement

Lunar Eclipse On Team India: గ్రహణం ఎఫెక్ట్.. టీమిండియాకు ఊహించ‌ని షాక్‌..సెమీస్ కు ముందే అడ్డంకులు

Lunar Eclipse On Team India: గ్రహణం ఎఫెక్ట్.. టీమిండియాకు ఊహించ‌ని షాక్‌..సెమీస్ కు ముందే అడ్డంకులు
Advertisement

Lunar Eclipse On Team India: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సెమిస్ దశకు వచ్చిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభమవుతాయి. ఇక రెండో సెమీ ఫైనల్ లో భాగంగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్  ( Team India vs England) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని పరిణామం ఎదురైంది. టీమిండియా ప్రాక్టీస్ కు చంద్ర గ్రహణం ( Lunar Eclipse) అడ్డుగా మారింది. దీంతో టీమిండియా షెడ్యూల్ టైమింగ్స్ మొత్తం మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

టీమిండియా ప్రాక్టీస్ కు సూర్యగ్రహణం ఎఫెక్ట్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( team india vs england ) మధ్య రెండో సెమీ ఫైనల్ మార్చి 5వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని వాంఖ‌డే స్టేడియం ( wankhede stadium ) వేదికగా టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం సూర్యగ్రహణం ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ గ్రహణం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ షెడ్యూల్ టైమింగ్స్ మొత్తం మార్చేశారు. 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రాక్టీస్… దాదాపు 7 గంటలకు షురూ అయింది. ఇక అర్ధరాత్రి 11 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చంద్ర గ్రహణం ( Lunar Eclipse On Team India ) సమయంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తే మంచిది కాదని పండితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే టీమిండియా ప్రాక్టీస్ షెడ్యూల్ ను వాయిదా వేశారు. అటు ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం చంద్రగ్రహణంతో సంబంధం లేకుండా ప్రాక్టీస్ లో మునిగి తేలినట్లు తెలుస్తోంది.

మార్చి 5వ తేదీన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్

ఎల్లుండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీఫైనల్ జరగనుంది. ముంబై వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్ చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు వస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్షం పడినప్పటికీ రిజర్వుడే ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మార్చి ఆరవ తేదీన ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకపోతే నెట్ రన్ రేట్ ప్రకారం ఇంగ్లాండ్ ఫైనల్ కు దూసుకు వెళ్తుంది.

Advertisement

Also Read: Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×