E-Paper
Advertisement

Child Welfare: ఆ జిల్లా నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. రూ.34,000 జీతంతో ఉద్యోగాలు

Child Welfare: ఆ జిల్లా నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. రూ.34,000 జీతంతో ఉద్యోగాలు
Advertisement

ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లాలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం 13 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండి నిర్ణీత విద్యార్హతలు కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Advertisement

పోస్టుల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో కీలకమైన సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు ఒకటి ఉండగా.. సైకో సోషల్ కౌన్సిలర్ విభాగంలో ఒక ఖాళీ ఉంది. మహిళలకు అండగా నిలిచేందుకు ఇద్దరు కేస్ వర్కర్లను ప్రభుత్వం నియమించనున్నారు.

Advertisement

న్యాయపరమైన సలహాల కోసం ఒక పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్ పోస్టు కేటాయించారు. వైద్య సేవలు అందించేందుకు ఒక పారా మెడికల్ పర్సనల్ ఖాళీ అందుబాటులో ఉంది. కార్యాలయ పనుల కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక ఆఫీస్ అసిస్టెంట్‌ను ఎంపిక చేస్తారు. వీటితో పాటు భద్రత కోసం ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.. వంట ఇతర పనుల కోసం ముగ్గురు మల్టీపర్పస్ స్టాఫ్ సభ్యుల నియామకం జరుగుతుంది.

విద్యార్హత:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ వంటి సబ్జెక్టుల్లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్హతతో పాటు నిర్ణీత కాలం పాటు సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం కలిగి ఉండటం తప్పనిసరి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 2026 జనవరి 1వ తేదీ నాటికి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు రూ. 13,000 నుంచి గరిష్ఠంగా రూ. 34,000 వరకు వేతనం చెల్లిస్తారు.

ఉద్యోగ ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ప్రతిభను గుర్తించి ఎంపిక ప్రక్రియ చేపడతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోస్టర్ పద్ధతిలో నియామకాలు జరుగుతాయి.

దరఖాస్తు ప్రక్రియ:

ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను శ్రీకాకుళంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయంలో స్వయంగా అందజేయాలి.

దరఖాస్తులు సమర్పించడానికి 2026 మార్చి 13వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://srikakulam.ap.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×