BigTV English

Manchu Vishnu: ప్రభాస్ నా జీవితంలో కృష్ణుడు.. విష్ణు వాడకం వేరే లెవెల్ అబ్బా!

Manchu Vishnu: ప్రభాస్ నా జీవితంలో కృష్ణుడు.. విష్ణు వాడకం వేరే లెవెల్ అబ్బా!

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప (Kannappa)సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. కన్నప్ప సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాలలో కూడా భారీగా ఈవెంట్లు చేస్తూ వరుస ప్రమోషన్లను నిర్వహిస్తూ వచ్చారు. ఇక చివరిగా హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ వస్తారని అందరూ భావించారు కానీ ప్రభాస్ (Prabhas) రాకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు.


రుద్ర పాత్రలో ప్రభాస్…

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఈ సినిమా గొప్పతనం గురించి, ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతలా కష్టపడ్డారనే విషయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ పాత్ర ఎప్పుడు ఉండబోతుంది? ఎంతసేపు ఉండబోతుందనే విషయాల గురించి అప్డేట్ ఇస్తూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నారు.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర (Rudra)పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. దాదాపు అరగంట పాటు ఈయన స్క్రీన్ స్పేస్ ఉండబోతుందని తెలుస్తుంది.


ప్రభాస్ కృష్ణుడు లాంటివాడు..

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మంచు విష్ణు ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ… మన జీవితంలో స్నేహితులు రెండు రకాలుగా ఉండాలని తెలిపారు. ఒకరు కృష్ణుడు… మరొకరు కర్ణుడు. ఇలాంటి ఇద్దరు స్నేహితులు మన జీవితంలో ఉండాలి. కృష్ణుడు నేను నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా అంటాడు. ఇక కర్ణుడు నువ్వేమైనా చెయ్యి.. నీ వెనకే నేనుంటాను అనే భరోసా ఇస్తాడు. ఇలాంటి ఇద్దరు స్నేహితులు మన జీవితంలో ఉండాలని విష్ణు తెలిపారు.

మోహన్ బాబు కోసమే…

నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు లాంటివాడు. ఏ కష్టం వచ్చినా తను నా పక్కనే ఉంటాడు . ప్రభాస్ కు ఈ సినిమా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ అతను నాన్న పై ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవంతో మాత్రమే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. ఇప్పటికీ నేను ఇదే విషయం చెప్తా నువ్వు నా కోసం సినిమా చేయలేదు అంటే అవును నేను నీకోసం కాదు, బావ కోసమే సినిమా చేశాను అంటూ మోహన్ బాబుని ఉద్దేశించి మాట్లాడతారని విష్ణు తెలిపారు. ఇలా మంచు విష్ణు ఈ సినిమా వేడుకలో ఎక్కువగా ప్రభాస్ గురించి మాట్లాడటంతో కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు ప్రభాస్ పేరును మామూలుగా వాడడం లేదు… ఇది వేరే లెవెల్ వాడకం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు కూడా కన్నప్ప సినిమా కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

Also Read: Rashmika Mandanna: వామ్మో రష్మిక ఫస్ట్ లవ్ ఆ హీరో కాదా… ఎవరో తెలుసా.. మామూలు లవ్ స్టోరీలు కాదుగా?

Related News

Kantara Chapter1 : కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్!

Sai Pallavi Bikini: బికినీ ఫోటోలపై రియాక్ట్ అయిన సాయి పల్లవి. నిజంగా తీసినవే అంటూ!

STR49 : మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్, శింబు కొత్త లుక్ అదిరింది 

Rishabh shetty: జై హనుమాన్ అద్భుతం… షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్!

Dulquer Salmaan : కేరళ హైకోర్టుకు వెళ్లిన దుల్కర్ సల్మాన్, కస్టమ్స్ అధికారులకు సవాల్

The Paradise Film: నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్… ఇది అస్సలు ఊహించలేదుగా!

Dharma Mahesh: మౌనం వీడిన హీరో ధర్మ మహేష్‌.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్‌..!

Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

×