Rashmika Mandanna : నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె కన్నడ సినీ ఇండస్ట్రీ మంచి హీరోయిన్ గా పరిచయమయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరిక్ పార్టీ (Kirik Party)అనే సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాలో రష్మికకు జోడిగా నటుడు రక్షిత్ శెట్టి(Rakshith Shetty) నటించారు. ఈ సినిమా సమయంలోనే రష్మిక, రక్షిత్ మధ్య ప్రేమాయణం కూడా మొదలైందని తెలుస్తుంది. ఇలా ప్రేమలో మునిగిన ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.
రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం…
ఇలా వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడమే కాకుండా ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే రష్మిక నిశ్చితార్థం(Engagment) తర్వాత కొన్ని కారణాల వల్ల రక్షిత్ శెట్టితో తన నిశ్చితార్థానికి బ్రేకప్ చెప్పుకొని పూర్తిస్థాయిలో కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన రష్మిక ఇక్కడ వరుస తెలుగు సినిమాలలో స్టార్ హీరోలు సరసన అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక పుష్ప సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.
విజయ్ దేవరకొండతో రిలేషన్..
ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న రష్మిక వ్యక్తిగత విషయాల ద్వారా తరచు వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక వ్యక్తిగత విషయానికి వస్తే ముఖ్యంగా ఈమె లవ్ రూమర్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించారు. అనంతరం డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
స్కూల్లోనే ప్రపోజల్స్..
ఇలా ఈ రెండు సినిమాలలో నటించిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి తిరగడంతో అందరూ నిజమేనని భావిస్తున్నారు. అయితే తాజాగా రష్మిక లవ్ గురించి మరొక వార్త వెలుగులోకి వచ్చింది. రష్మికకు రక్షిత్ శెట్టి ఫస్ట్ లవ్ కాదని ఈమెకు ఫస్ట్ లవ్(First Love) స్కూల్ మొదలైంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. స్వయంగా ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో రష్మిక తెలియజేశారు. స్కూల్లో చదువుతున్న సమయంలోనే తనకు లవ్ ప్రపోజల్స్ వచ్చాయని అదే తన ఫస్ట్ లవ్ అంటూ రష్మిక చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి దీంతో రష్మిక ఫస్ట్ లవ్ రక్షితశెట్టి కాదా..అమ్మడికి లవ్ స్టోరీలు మామూలుగా లేవే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉన్నప్పటికీ ప్రేమ విషయాన్ని మాత్రం ఎక్కడ బయట పెట్టలేదు.
Also Read: కుబేర రన్ టైం… నా కంటే మీకే ఎక్కువ తెలుసా ? శేఖర్ కమ్ముల ఫైర్