Star Hero: ప్రపంచ సినిమా పరిశ్రమలో పెద్దపెద్ద టాలెంటెడ్ నటులు చనిపోతున్నారు. ముఖ్యంగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రముఖ హాలీవుడ్ నటుడు జాక్ బెల్ట్స్(96) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఓసోస్లోని తన ఇంట్లో నిద్రలోనే బెట్ట్స్ మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మరణానికి గుండె సంబంధిత వ్యాధి కారణం కావొచ్చని భావిస్తున్నారు. థియేటర్, టెలివిజన్, సినిమాల్లో నటన ద్వారా బెల్ట్స్ మంచి గుర్తింపు పొందారు. స్పైడర్ మ్యాన్, గాడ్స్ అండ్ మాన్స్టర్స్ వంటి పలు చిత్రాలు ఆయనకు గుర్తింపును తీసుకొచ్చాయి.
జాక్ ఫిల్మోర్ బెట్స్ కెరియర్
జాక్ ఫిల్మోర్ బెట్స్ ఏప్రిల్ 11, 1929 లో జన్మించారు. జాక్ ఫిల్మోర్ బెట్స్ ను హంట్ పవర్స్ అని కూడా పిలుస్తారు , ఒక అమెరికన్ క్యారెక్టర్ నటుడు. 10 సంవత్సరాల వయసులో అతని కుటుంబం ఫ్లోరిడాలోని మయామికి వెళ్లారు. అతను వియోడ్ లో టాలెంట్ పోటీకి ఆడిషన్‌లో పాల్గొన్నాడు . మయామి విశ్వవిద్యాలయంలో చేరాడు , అక్కడ అతను థియేటర్ కోర్స్ చేశాడు. బెట్స్ 1953లో రిచర్డ్ నాటకంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు . తన కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేశాడు. 1982లో వన్ లైఫ్ టు లైవ్‌లో 80 ఏళ్ల వృద్ధుడైన మిస్టర్ ఫిషర్ పాత్రను కూడా పోషించి మంచి పేరును సంపాదించుకున్నాడు. బెట్స్ జూన్ 19, 2025న కాలిఫోర్నియాలోని లాస్ ఓసోస్‌లో 96 సంవత్సరాల వయసులో నిద్రలోనే మరణించాడు.
Also Read : Kannappa Pre Release Event : ప్రభాస్ ఎంట్రీతోనే అసలు సినిమా… డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఇది