Metro Second Phase: మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్, డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని ఆయన చెప్పారు.
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ప్రాజెక్టులో మూడు కారిడార్లు ఉన్నాయి. ఇందులో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (ఆర్‌జీఐఏ) నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మేరు ఓ కారిడార్ ఉంది. దీనికి అయ్యే ఖర్చు రూ.7186 కోట్లు. రెండో కారిడార్ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మేర ఉంది. దీనికి అయ్యే ఖర్చు రూ.6,946 కోట్లు. మూడో కారిడార్ జేబీఎస్ నుంచి షామీర్ పేట వరకు 22 కిలోమీటర్ల మేర ఉంది. దీనికి అయ్యే ఖర్చు రూ.5,465 కోట్లు.
మూడు కారిడార్ లు ఇవే..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జీఐఎ ) నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కి.మీ: రూ. 7,168 కోట్లు)
జేబీఎస్ నుండి మేడ్చల్ (24.5 కి.మీ; రూ. 6,946 కోట్లు)
జేబీఎస్ నుండి షామిర్‌పేట (22 కి.మీ; రూ. 5,465 కోట్లు)
మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేస్తూ, రెండో దశ ప్రాజెక్టులో మొత్తం రూ. 19,579 కోట్లు పెట్టుబడి ఉంటుంది. ముందు సమర్పించిన ప్లీజ్ 2 (ఎ) ప్రాజెక్ట్ ఐదు కారిడార్లు (76.4 కి.మీ) లాగా, రెండో దశ ప్రాజెక్టును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ JV ప్రాజెక్టు నిబంధనల ప్రకారం, రెండవ దశ వ్యయం రూ. 19,579 కోట్లు అవుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5874 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3524 కోట్లు. ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం రూ.9398 కోట్లు, అలాగే చిన్న పీపీపీ నుంచి రూ.783 కోట్లు ఉంటుంది.
నిర్మాణ వ్యయ వివరాలు..
మొత్తం వ్యయం: రూ.19,579 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ. 5,874 కోట్లు (30%)..
కేంద్ర ప్రభుత్వ వాటా: రూ. 3,524 కోట్లు (18%)..
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణం రూ. 9,398 కోట్లు (48%),
చిన్న PPP భాగం రూ. 783 కోట్లు (4%)