E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి చేపట్టిన పనుల్లో అంతరాయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి చేపట్టిన పనుల్లో అంతరాయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. 

వృషభం

Advertisement

దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.  ఉద్యోగమున స్థానచలన  సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. 

మిథునం

వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి.  కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం

Advertisement

విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

సింహం

దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.   ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కన్య

 పాత రుణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతం ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చికం

అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది. 

ధనుస్సు

సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. బంధు, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.

మకరం

నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.  ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. 

కుంభం

గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం

సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ  సూచనలున్నవి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×