E-Paper
Advertisement

Karthi: రెస్టారెంట్స్ లో కార్తీ ఖైదీ సినిమా పోస్టర్లు, కార్తీ ఏమన్నాడంటే?

Karthi: రెస్టారెంట్స్ లో కార్తీ ఖైదీ సినిమా పోస్టర్లు, కార్తీ ఏమన్నాడంటే?
Advertisement

Karthi: కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ కు ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సీన్ చూసిన ప్రతిసారి దాని ముందు గనక జరిగిన సీన్లు కూడా విపరీతంగా గుర్తొస్తాయి. అయితే కథలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయితే కానీ ఆ సీన్ ఇంపాక్ట్ అనేది చూపించదు. అలానే ఇవన్నీ జరగాలి అంటే సినిమా ముందు సక్సెస్ సాధించాలి. సినిమా సక్సెస్ సాధించినప్పుడే కొన్ని ఐకానిక్ సీన్స్ అలా గుర్తుండిపోతాయి.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన సినిమా ఖైదీ. విపరీతమైన అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఎవరు ఊహించని రేంజ్ లో ఆడియన్స్ ని సప్రైజ్ చేసింది. ఈ సినిమా సక్సెస్ అయిపోయిన వెంటనే విజయ్ లాంటి స్టార్ హీరో తో తమిళ్లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు దర్శకుడు లోకేష్. ఈ సినిమా తర్వాత విజయ్ మరియు విజయ్ సేతుపతిలతో కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా మేకింగ్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

రెస్టారెంట్స్ లో కార్తీ ఫోటో 

Advertisement

ఖైదీ సినిమాలో జైలు నుంచి విడుదలైన ఢిల్లీ కొంతమంది పోలీసులను కాపాడాల్సి వస్తుంది. పోలీసులు అందరూ కలిసి ఒక పార్టీలో విషపూరితమైన ఆహారం తిని పడిపోవడం వలన ఢిల్లీ ఒక్కడే మిగులుతాడు. వాళ్లందర్నీ రక్షించడానికి అంటే ముందు ఒక బిరియాని టబ్ దగ్గరికి వెళ్లి బకెట్ నింపుగా బిర్యాని తీసుకొని ఒక పెద్ద మూత పై బిర్యానీ వేసుకుని తింటుంటాడు ఢిల్లీ.

కార్తి ఢిల్లీ పాత్రలో నటించిన విధానం అప్పట్లో చాలా మందికి మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఇప్పటికీ కూడా ఆ ఫోటో చూస్తుంటే ముందు వెనక జరిగే సీన్లు గుర్తొస్తూ ఉంటాయి. అంత ఇష్టంగా బిర్యానీ తింటూ ఉంటాడు కార్తీ. అయితే ఆ ఫోటోలే చాలా రెస్టారెంట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అయితే దానిపైన కార్తి రియాక్ట్ అయ్యాడు. చాలా రెస్టారెంట్స్ లో ఆ ఫోటోలు కనిపించడం అనేది నాకు చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళు దానిని ప్రాపర్ గా ఫోటోలను వాడారు అంటూ రియాక్ట్ అయ్యాడు.

లోకేష్ ఫుడ్ ఫాంటసీ 

Advertisement

ఇక ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన ఇష్టాలనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. లోకేష్ సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ఫుడ్ బాగా హైలైట్ అవుతుంది. ఖైదీ సినిమాలో కార్తీ సీన్ పక్కన పెడితే విక్రమ్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడే చాలా మందిని కమల్ హాసన్ పిలిచి అందరికీ హాల్లో డైనింగ్ టేబుల్ వద్ద ఫుడ్ పెడతారు.

విక్రమ్ సినిమా కమల్ హాసన్ కెరియర్ లో ఎంత సక్సెస్ సాధించింది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా విపరీతంగా సక్సెస్ అయిపోయి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసిన తర్వాత కూడా అదే మాదిరిగా చాలామందికి పిలిచి భోజనాలు పెట్టారు కమల్ హాసన్.

Also Read: JETLEE : రియా ఇక్కడే, కమెడియన్ సత్యకు హీరోయిన్ సెట్, కానీ ఆ కండిషన్స్

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×