GHMCలో కొత్తగా ఏర్పడిన వార్డులపై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. బౌండరీల మార్పుపై అభ్యంతరాలు లేవనెత్తారు MIM నేతలు. మొదటి ప్రాతిపదికన సరిహద్దులు.. రెండో ప్రాతిపదికన జనాభాను బేస్ చేసుకొని వార్డుల డిలీమిటేషన్ చేస్తున్నారు. దీంతో GHMC కమిషనర్ కర్ణన్‌ను కలిసి.. తమ అభ్యంతరాలు చెప్పారు MIM నేతలు. కర్ణన్‌ను కలిసి వారిలో..Mim ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, ఎమ్మెల్యేలు మజీద్, కౌసర్ మొహియుద్దీన్, ముజీబ్ ఉన్నారు. ఇవాళ్టి నుండి 7 రోజుల పాటు విజ్ఞప్తులు స్వీకరించనున్నారు GHMC కమిషనర్.
మంత్రి నారా లోకేష్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం గతంలో చేసిన అప్పులను తీర్చి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో అవినీతి జరిగిందని, అందుకే టీడీపీ నేతలు మాట్లాడటం లేదన్నారు. లోకేష్ దోపిడీ సంపాదన మీదే దృష్టి పెట్టారని, విమానాశ్రయాల్లో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపు జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశామన్నారు అదనపు కలెక్టర్ డేవిడ్. మొదటి దశలో కుమ్రం భీం జిల్లాలో 114 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు అదనపు కలెక్టర్. వీటికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటున్న జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డేవిడ్‌తో
హైదరాబాద్‌లో భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ‘ఫ్రీ లాంచ్’ పేరుతో ఈ కంపెనీ 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యం, మార్కెటింగ్ డైరెక్టర్ బీబీ గుప్తా సహా నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
హయత్ నగర్, కల్వంచలోని చంద్రాయన గుట్ట మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా కల్వంచలో ఉన్న హాస్టల్‌ను అధికారులు బార్కస్ సమీపంలోకి మార్చాలని ప్రయత్నించడాన్ని వారు అడ్డుకున్నారు. హాస్టల్‌ను మారుస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తుతాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరో మూడు నెలల్లో చదువులు పూర్తవుతాయి కాబట్టి, అంతవరకు గడువు ఇవ్వాలని వారు అధికారులను కోరారు.
హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పరిధిలో ఈనెల 3న జరిగిన జునైద్ హత్య కేసును దక్షిణ మండల పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో 12 మంది పాత్ర ఉందని డీసీపీ కె. కిరణ్ ప్రభాకర్ తెలిపారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ముఖ్య నిందితులు, మృతుడి మధ్య పాత కక్షలు ఉన్నాయని, పథకం ప్రకారమే కత్తులతో దాడి చేసి హతమార్చారని డీసీపీ వివరించారు. నిందితులు బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లుగా కూడా
కోదాడలో మత్స్యశాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చెరువులో చేప పిల్లలు పోయకుండానే, ఖాళీ వాహనం తెచ్చి వేసినట్లు విచిత్రమైన డ్రామాలు ఆడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. చెరువు చైర్మన్‌కు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండానే చేపలు పోసినట్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 100 మంది కార్యకర్తలతో బీజేపీ నేతను కలవడాన్ని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నిరసిస్తూ, పెద్ద ఎత్తున గ్రామస్థులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఉద్రిక్తతను తగ్గించారు.
సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ వారికి ఇన్సూరెన్స్ బాండ్‌లను పంపిణీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు భీమా ఇచ్చి కార్మిక పక్షపాతిగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో మోసం ఎలా ఉంటుందో చూపించిందని విమర్శించారు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్ అలీ పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల లోపు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే, హైదరాబాద్‌లో మహా ధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల కలిసి పరిశీలించారు. అధికారులు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్న తీరును గమనించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని నందిగామ, క్యాసారం, బానూర్ గ్రామాల్లో రేపు జరగనున్న మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 36 పోలింగ్ కేంద్రాలకు 125 మంది సిబ్బందిని సమాయత్తం చేశారు. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు కొనసాగుతుంది, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రికార్డింగ్ డ్యాన్స్‌లపై నిషేధం ఉన్నప్పటికీ, యథేచ్ఛగా ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై జనసేన నాయకత్వం స్పందన తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లా రేగిడి మండలం బాలకవివలస గ్రామంలో తాళం వేసి ఉన్న కిలారి కమల ఇంట్లో 13 తులాల బంగారం చోరీ అయింది. తాళం యథావిధిగా ఉన్నప్పటికీ, ఇంట్లోని బీరువాలో బంగారం మాయమైంది. సమాచారం అందుకున్న సీఐ ఉపేంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 40 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇది రాయలసీమకు గొప్ప అవకాశమని, పెండింగ్ ప్రాజెక్టులు, హార్టికల్చర్, రహదారుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తనపై జరిగిన దుష్ప్రచారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిలమ్మ, విజయమ్మలపై పోస్టులు పెట్టిన వారికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారని, తనపై పెట్టిన కేసులో స్థానిక పోలీసులు ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో తనకు సంబంధం లేదని ఎస్పీ చెప్పారని, త్వరలో ఎస్పీని కలిసి విచారణ వేగవంతం చేయాలని కోరతానని రవీందర్ రెడ్డి తెలిపారు.
అమెరికా తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత హెచ్-1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది (H-1B visa applicants). ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
ఇండిగో విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలతో ఇటీవల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తమ ముందు హాజరుకావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి పరిణామాలకు సంబంధించిన పూర్తి డేటాతో ఈ నెల 11న డీజీసీఏ కార్యాలయానికి రావాలని ఓ ప్రకటనలో తెలిపింది.
అభివృద్ధి చెందిన దేశాలు, పొరుగుదేశాలతో పోలిస్తే భారత్‌లోనే రైలు టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. వీటి ధరలు తక్కువగా ఉంచేందుకు గతేడాది రూ.60వేల కోట్లు సబ్సిడీ అందించామన్నారు. వయోవృద్ధులకు రైలు టికెట్ రాయితీని పునరుద్ధరించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అని కాంగ్రెస్ ఎంపీ ఎంకే విష్ణు ప్రసాద్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి (Ashwini Vaishnaw) ఈ సమాధానమిచ్చారు.
రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న 4కేలో రీరిలీజ్ చేయనున్నారు. నీలాంబరి టైటిల్‌తో చిత్రం రెండో భాగాన్ని రూపొందించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కథ, పాత్రలు చక్కగా కుదిరితే కచ్చితంగా చిత్రం రూపొందుతుందని వెల్లడించారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే మొదటి స్థానానికి అతి చేరువగా వచ్చాడు! ప్రస్తుతం ఆ స్థానంలో రోహిత్ శర్మ (Rohit Sharama) ఉన్నాడు. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను వెనక్కి నెట్టి రెండు స్థానాలు ఎగబాకాడు.