Pak Army Officer Winks: పాకిస్తాన్ సైనిక అధికారులు వికృక చేష్టలు మరోసారి బయటపడ్డాయి. ఓ మహిళా జర్నలిస్టుకు కన్ను గీటి పాక్ సైనిక అధికారి అనుచితంగా ప్రవర్తించారు. పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అధికార మీడియా సమావేశంలో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు మీడియా సభ్యుల ముందే మహిళా జర్నలిస్ట్‌ను చూసి షరీఫ్ చౌదరి కన్ను గీటారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆర్మీ జనరల్ అహ్మద్ షరీఫ్ మహిళా జర్నలిస్టుకు కన్ను గీటారు.
జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై జర్నలిస్ట్ అబ్సా కోమల్.. ఆర్మీ జనరల్ ప్రశ్నించారు. దీనికి చౌదరి సమాధానం చెబుతూ.. ఇది జాతీయ భద్రతా ముప్పునకు సంబంధించిన అంశం, ఇమ్రాన్ ఖాన్ దేశ వ్యతిరేకి, ఆయన ఢిల్లీ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఒక మానసిక రోగి అని నవ్వుతూ.. జర్నలిస్ట్ ను చూసి కన్నుగీటారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను ప్రొఫెషనల్ సైనికుడు కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్తాన్ సైన్యానికి జనరల్ అయి ఉండి ఓ మహిళా జర్నలిస్ట్ తో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ చౌదరి తరచుగా మీడియాలో కనిపిస్తున్నారు. భారత్ పై అక్కసు వెళ్లగక్కడంతో చౌదరి పేరు సంపాదించారు. మే నెలలో న్యూదిల్లీ, ఇస్లామాబాద్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో అవాస్తవాలు మాట్లాడి అభాసుపాలయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారని పెద్ద ఎత్తున ప్రచారం జోరుగుతోంది. అతడి సమాచారం బయటకురావకపోవడం, కుటుంబ సభ్యులను కలవనీయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Shameless. Pakistan Army Spokesperson seen winking at a female journalist during a press conference. In any normal country there would have been a public and media outrage and immediate action by the institution. In Pakistan harassment of women is normal.pic.twitter.com/nFYpcrL3jK
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 9, 2025
ఈ విషయంపై లెఫ్టినెంట్ జనరల్ చౌదరి ఖాన్‌పై ఒత్తిడి పెరగడంతో.. తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ బ్రీఫింగ్‌లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను”నార్సిసిస్ట్”, “మానసిక రోగి” అని పిలిచారు. పాకిస్తాన్ సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Also Read: Flight Accident Video: హైవేపై కారు మీద ల్యాండైన విమానం.. విన్యాసం కాదు, ఘోర ప్రమాదం
ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి అని అభివర్ణించారని, పాకిస్తాన్‌లో చట్ట పాలన పూర్తిగా పతనావస్థకు చేరుకుందని ఖాన్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై చౌదరి స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.