E-Paper
Advertisement

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?
Advertisement

Sardar 2 Twitter Review : తమిళ హీరో కార్తీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కార్తీ సర్దార్ 2 సినిమాలో నటించాడు. ఈ మూవీపై గత కొద్ది రోజులుగా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన సర్దార్‌కు కొనసాగింపుంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాది జూన్‌లోనే పూర్తయ్యింది.. కానీ ఏడాది కావోస్తోన్న ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోలేదు. మొత్తానికి ఈ మూవీ ఇవాళ భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుని పెంచిన చిత్ర యూనిట్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.. మరి ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో ఒకసారి ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో విజయవంతమైన ‘సర్దార్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2′ వస్తోంది. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్‌ కథానాయికలు. ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. గతంలో వచ్చిన సర్దార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాలో నీటి సమస్య గురించి చెప్పి జనాలను ప్రభావితం చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఇష్యూతో వచ్చిందో అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా రెస్పాన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Advertisement

కార్తీ నటించిన సర్దార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.’ సర్దార్’ సునామీకి పెరంబలూరు జిల్లా సిద్ధం!.. ఈ రోజు కేవలం ఒక సినిమా విడుదల మాత్రమే కాదు.. ఇది కార్తీ అన్న సంచలనం సృష్టించాడు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

ఈ సినిమా పై రెస్పాన్స్ చూస్తుంటే పాజిటివ్ గా నే ఉంది. ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ ఘట్టంతో కూడిన ఆశాజనకమైన ప్రథమార్థం ఇది. యోగి బాబు సీన్లు చాలా బాగా ఉన్నాయి. అంతే కాదు మాళవిక మోహన్ కి ఈ సినిమా మంచి హిట్ ని అందించేలా ఉంది. అక్కడక్కడ కొన్ని ఊహించిన సీన్లు ఉన్నా కూడా సినిమాకు మంచి టాక్ అయితే వినిపిస్తుంది.. సూర్యని మంచిగా ఉపయోగించుకుని ఉంటే ఇంకాస్త బాగుండేదేమో అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

సర్దార్ 2 మూవీ చాలా బాగుంది.. ఈ మూవీలో చాలా మంచి పాత్రలు కనిపిస్తున్నాయి. మూవీ చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కుడా బాగుంది. ఎండ్ ఆఫ్ లో ఎస్ జి సూర్య పాత్ర పర్వాలేదు అనే అనిపిస్తుంది అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ తో ట్వీట్ చేశారు..

మొత్తానికి సర్దార్ 2 సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కార్తీ అన్న ఈ సినిమాతో విజయం సాధించడం చూడాలని నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆయనకు మరియు ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది.

 

తమిళ హీరో కార్తీ నటించిన సర్దార్ 2 మూవీ ఇవాళ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి పార్ట్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని ట్విట్టర్ రివ్యూ లో కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.. అయితే మరి కొంతమంది మాత్రం కార్తీ ఈ సినిమాలో కూడా దున్నేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి మొదటి షో తో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది.. కానీ ఇప్పటివరకైతే టాక్ పర్వాలేదు అని ఉన్నా కూడా ఇక ముందు షోలకు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా సినిమా టాక్ అయితే బాగుంది అని తెలుస్తుంది.. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఏంటో అన్నది తెలియాల్సి ఉంది..

Also Read:Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×