Philippines: ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులకు హాట్‌స్పాట్‌గా మారిన ఫిలిప్పీన్స్‌లోని పలవాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పర్యాటక కేంద్రానికి చెందిన ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన లో ఐదుగురు మరణించారు. 87 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని కోస్ట్ గార్డ్ వెల్లడించారు. అసలు ఘటన ఎలా జరిగింది?
ఫిలిప్పిన్స్‌లోని ప్రముఖ పర్యటక ప్రాంతం పలవాన్ సమీపంలోని ఓ ఫెర్రీ లేకుంటే పడవ రాత్రి సముద్రం మధ్యలో అగ్ని ప్రమాదానికి గురైంది. పర్యాటక కేంద్రం కోరాన్ సమీప జలాల్లో MV జూన్ ఆస్టర్ అనే పడవలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో పడవలో 137 మంది పర్యాటకలు ఉన్నారు.
అందులో 117 మంది ప్రయాణికులు ఉండగా, మిగతా 17 మంది సిబ్బంది.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు వెల్లడైంది. మరో 87 మంది ఆచూకీ కనిపించలేదు. 42 మందిని సిబ్బంది కాపాడినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి ఈ ఘటనపై మాట్లాడారు.
బుధవారం రాత్రి 11 గంటల సమయంలో భారీగా మంటలు కనిపించాయని తెలిపారు. 42 మందిని తాము కాపాడామని, మృతదేహాలను కోరాన్‌కు తరలించినట్లు తెలిపారు. సముద్ర తీరానికి 1.2 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. జాడ తెలియని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రక్షించినవారిలో 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
ALSO READ: ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!
ఫిలిప్పిన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో టూరిస్టులకు సంబంధించిన ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వాల కారణమా? లేకుంటే నిర్వాహకుల కారణమా? అనేది తెలీదు. ఫలితంగా చాలామంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకుంటే.. పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశముందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
التهمتها النيران.. قتلى وعشرات المفقودين بحريق عبّارة في #الفلبين#إرم_نيوز #Philippines pic.twitter.com/VMcWCMq8WL
— Erem News – إرم نيوز (@EremNews) September 10, 2026