E-Paper
Advertisement

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
Advertisement

Hyderabad: ఎంతోకాలంగా హైదరాబాద్ నగరవాసులు ఎదురుచూస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజున ప్రారంభించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ప్రక్రియలను వేగవంతం చేశారు. తొలి దశ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,345.12 కోట్లకు అనుమతులు జారీ చేసింది.

మూసీ నది పనులకు దసరా నుంచి శ్రీకారం

రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు మూసీ నది సుందరీకరణ. ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేందుకు అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశ పనులను దసరా రోజు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ సిటీకి కొత్త అందాలు తీసుకువచ్చే ప్రాజెక్టు కావడంతో సంబంధించి అన్ని ప్రక్రియలను వేగవంతం చేశారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి దశ పనుల కోసం రూ.7,345.12 కోట్లు అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు రూ.4,500 కోట్లను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రుణంగా తీసుకుంది. మిగతా రూ.2,845.12 కోట్లను హెచ్‌ఎండీఏ-టీజీఐఐసీ సంస్థల ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

అధికారులు ఫేజ్-1 సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఏడీబీకి సమర్పించారు. ప్రస్తుతం రుణ మంజూరు ప్రక్రియ అంశం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడువారాల్లో క్లారిటీ వస్తుందన్నది అధికారుల అంచనా. దీంతో దసరా రోజు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.

తొలి దశ నిర్మాణం పనులు ఏయే ప్రాంతాలు

Advertisement

అనంతగిరి కొండల నుంచి మూసీ నది నుంచి మూసా-ఈసీ రెండు పాయలుగా ప్రవహిస్తుంది. ఈసీపై హిమాయత్‌ సాగర్‌, మూసాపై గండిపేట రిజర్వాయర్లు తర్వాత దిగువకు పారి లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌ ప్రాంతంలో కలిసి మూసీగా మారుతాయి. ఫేజ్‌-1 కింద హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు అంటే దాదాపు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11.8 కిలోమీటర్లు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ఈ రెండు సమాంతరంగా పనులు పూర్తి చేసేందుకు అడుగులు వేస్తు్న్నారు. నిర్మాణం, సుందరీకరణ తదితర పనులకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు సమాచారం. అదే సమయంలో ఫేజ్‌-2 పనుల డీపీఆర్‌ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రెండో విడత సుమారు 55 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు.

నాగోలు నుంచి గౌరెల్లి వరకు ప్రతిపాదించారు. నదిలో మురుగు చేరకుండా ఇరువైపులా ట్రంక్‌ లైన్ల నిర్మాణం జరగనుంది. నదిలో పేరుకున్న వ్యర్థాల తొలగింపు చేయునున్నారు. నీటిని నిల్వ చేసి బోటింగ్‌కు ఏర్పాట్లు, మూసీ నది ఇరువైపులా ల్యాండ్‌స్కేప్‌ అభివృద్ధి, రోడ్లు- కిల్‌ ట్రాక్‌, పుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది.

ALSO READ: ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

Related News

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

Big Stories

Advertisement
×