E-Paper
Advertisement

Anjana Devi: చిరంజీవి మదర్‌కు విశ్వ మహిళ అవార్డ్.. ఇంకా ఎవరెవరికంటే?

Anjana Devi: చిరంజీవి మదర్‌కు విశ్వ మహిళ అవార్డ్.. ఇంకా ఎవరెవరికంటే?
Advertisement

Anjana Devi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మదర్ కొణిదెల అంజనాదేవి (Konidela Anjana Devi) మొట్టమొదటి ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ (Bapu Bomma Vishwa Mahila)గా రికార్డును క్రియేట్ చేశారు. బాపుబొమ్మగా తెలుగువారి గుండెల్లో నిలిచి, సామాజిక – రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్న నటి దివ్యవాణి చౌదరి (Divyavani Choudary). అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యవాణి.. ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ పేరిట 2026వ సంవత్సరానికిగాను అవార్డ్స్ ప్రదానం చేశారు. కొణిదెల అంజనాదేవి ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమెతో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ) తదితర మహిళామణులు ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.

Also Read- Chota K Naidu: ‘అంజి’ సినిమాకి తలెత్తుకుని పని చేస్తే.. ‘విశ్వంభర’కి తలదించుకుని పని చేస్తున్నా!

కొణిదెల అంజనాదేవితో శ్రీకారం

Advertisement

తెలంగాణ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కంఠంనేని రవిశంకర్, నటుడు – రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు అతిధులుగా హాజరయ్యారు. సినిమా రంగంతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ సేవలందిస్తున్న దివ్యవాణి.. ‘బాపు బొమ్మ- విశ్వ మహిళ’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం.. మెగా మాతృమూర్తి కొణిదెల అంజనాదేవితో శ్రీకారం చుట్టడం అభినందనీయమని హాజరైన వారంతా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. తొలి విడత వేడుకను ఇంత గ్రాండ్‌గా నిర్వహించడమే కాకుండా, అవార్డుకు తగిని అర్హులను ఎంపిక చేయడం గొప్ప విషయమని వారు కొనియాడారు.

Also Read- One Piece Season 2 OTT : రక్తం రుచి మరిగిన సముద్రపు దొంగలు… ఓటీటీలో దుమ్ములేపుతున్న సిరీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Advertisement

వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించుకోవడం ద్వారా.. సమాజంలోని సాటి మహిళామణులందరిలో స్ఫూర్తిని రగిలించాలనే వజ్ర సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని దివ్యవాణి తెలిపారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యవాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ అవార్డ్స్’ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా దివ్యవాణి ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే కార్యచరణ ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Also Read- Kissik Talks: తప్పు చేసిన వాళ్లకి వెంటనే శిక్ష పడాలి.. ‘లా’ పై లయ అసహనం

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×