E-Paper
Advertisement

Zootopia 2 OTT : శ్రద్ధా కపూర్ సూపర్ హిట్ యానిమేటెడ్ సీక్వెల్‌ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Zootopia 2 OTT : శ్రద్ధా కపూర్ సూపర్ హిట్ యానిమేటెడ్ సీక్వెల్‌ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Zootopia 2 OTT : గత ఏడాది థియేటర్లలో సూపర్ హిట్ అయిన యానిమేషన్ మూవీ ‘జూటోపియా 2’ ఇప్పుడు ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ఇది ‘జూటోపియా’ (2016) రికార్డులను కూడా అధిగమించింది. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹15,500 కోట్లు సంపాదించి, అన్ని యానిమేటెడ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. భారతదేశంలో కూడా దాదాపు ₹27.50 కోట్లు వసూలు చేసి, హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాల్లో టాప్ పెర్ఫార్మర్ అయింది. ఇప్పుడు ఈ మెగా హిట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ సినిమా ఇది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

అమెరికన్ యానిమేటెడ్ మూవీ ‘జూటోపియా 2’ (Zootopia 2) ప్రపంచవ్యాప్తంగా 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.86 బిలియన్ డాలర్ల వసూళ్లతో, అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేషన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా భారతదేశంలో 2026 మార్చి 13 నుండి JioHotstar ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాకి హిందీ వెర్షన్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె స్వరం పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది కూడా. ఇది హిందీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా 79వ BAFTAలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ గెలిచింది. ఇప్పుడు 98వ ఆస్కార్‌లో కూడా అదే కేటగిరీలో పోటీలో ఉండటం విశేషం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జూటోపియా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జూడీ హాప్స్, నిక్ వైల్డ్ కలిసి ఈసారి ఒక పెద్ద మిస్టరీని డీల్ చేస్తారు. నగరంలోకి కొత్తగా వచ్చిన గ్యారీ డి’స్నేక్ అనే తెలివైన పాము కోసం వీళ్లు వెతుకులాట మొదలుపెడతారు. ఈ క్రమంలో జూటోపియాలో ఎవరికీ తెలియని ‘మార్ష్ మార్కెట్’ లాంటి కొత్త ఏరియాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే ఇల్లీగల్ పనులను కనిపెడతారు. అసలు ఆ పాము సిటీలోకి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటనేది వీళ్లు ఛేదించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైమ్‌లో వీళ్లకు ఒక పవర్‌ఫుల్ లింక్స్ ఫ్యామిలీ నుంచి ఎదురుదెబ్బలు తగులుతాయి. అంతేకాకుండా పని ఒత్తిడి వల్ల జూడీ, నిక్ మధ్య చిన్న చిన్న గొడవలు కూడా అవుతుంటాయి. అప్పుడు డాక్టర్ ఫజ్బీ అనే ఒక థెరపిస్ట్ వీళ్లద్దరినీ మళ్ళీ ఒక్కటి చేస్తుంది. చివరికి ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటూ, ప్రాణాలకు తెగించి ఆ డేంజరస్ గ్యాంగ్‌ని ఎలా పట్టుకున్నారు ? జూటోపియా నగరాన్ని ఎలా కాపాడారు ? అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Read Also : దుర్యోధనుడి అవతారంలో సీరియల్ కిల్లర్… యుగాలు దాటే ప్రతీకారం…కసిగా ఒక్కో హత్య

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×