E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!
Advertisement

ChatGPT 80s Photo Trend: సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన ట్రెండ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అదే 1980s రెట్రో లుక్ ట్రెండ్. ఇందులో లేటెస్ట్ ఫోటోలను ఆ రోజుల్లో తీసినట్టుగా కనిపించేలా AI సాయంతో మార్చుకుంటున్నారు. సాధారణంగా వింటేజ్ ఫిల్టర్ పెడితే ఫోటో పాతదిగా కనిపిస్తుంది. కానీ, ఈ ట్రెండ్‌లో అంతకంటే ముందుకెళ్లి.. దుస్తులు, హెయిర్‌స్టైల్, యాక్సెసరీలు, లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్, ఫిల్మ్ టెక్స్చర్ ఇలా ఫోటోలోని మొత్తం వాతావరణాన్నే 1980 కాలానికి తగ్గట్టుగా మార్చుతున్నారు.

అసలు ఈ ట్రెండ్ ఏంటి?

ఈ ట్రెండ్‌లో మన దగ్గర ఉన్న ఒక ఫోటోను తీసుకుని, ఆ వ్యక్తి 1980 కాలంలో ఫోటో దిగితే ఎలా కనిపించేవారో AIతో ఊహించుకుంటారు. అయితే, ముఖం, ముఖ నిర్మాణం, హావభావాలు లాంటి ముఖ్యమైన లక్షణాలను సాధ్యమైనంత వరకు అలాగే ఉంచుతారు. మిగతా అంశాలను మనకు నచ్చిన స్టైల్‌లో రూపొందించుకోవచ్చు. పాత ఫ్యామిలీ ఆల్బమ్ ఫోటోలా, బాలీవుడ్ స్టూడియో పోర్ట్రెయిట్‌ లా, పెళ్లి ఫోటోలా, అప్పటి మ్యాగజైన్ షూట్‌ లా కూడా మార్చుకోవచ్చు.

ఇండియన్ రెట్రో లుక్ కావాలంటే!

Advertisement

80ల నాటి  ప్రతిబింబం కావాలనుకునే వారు ప్రాంప్ట్‌ లో కొన్ని వివరాలను చేర్చవచ్చు. మహిళలకు ఆ కాలానికి తగ్గ చీరలు, నగలు, హెయిర్‌స్టైల్, పురుషులకు మీసాలు, హై వెయిస్టెడ్ ప్యాంట్లు, షర్ట్లు లాంటి స్టైలింగ్‌ ను మార్చుకోవచ్చు.  అలాగే పాతకాలపు స్టూడియో బ్యాక్‌డ్రాప్, వెచ్చని లైటింగ్, అనలాగ్ కెమెరా ఎఫెక్ట్ లాంటి అంశాలను కూడా జోడిస్తే అవుట్ ఫుట్ రింత సహజంగా కనిపించే అవకాశం ఉంటుంది.

ChatGPTలో ఫోటో ఎలా మార్చుకోవాలి?

ముందుగా ముఖం స్పష్టంగా కనిపించే సెల్ఫీ లేదంటే పోర్ట్రెయిట్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటోను ChatGPTలో అప్‌లోడ్ చేసి, 1980ల లుక్‌ లోకి మార్చాలని సూచించాలి. మీకు ఎలాంటి దుస్తులు, హెయిర్‌ స్టైల్, బ్యాక్‌గ్రౌండ్ కావాలో కూడా ప్రాంప్ట్‌ లో స్పష్టంగా చెప్పొచ్చు.

Advertisement

ఎగ్జాంఫుల్ ప్రాంప్ట్:

“Transform this photo into a realistic 1980s photograph while keeping my face, facial structure, skin tone, expression and identity recognisable. Restyle my clothing, hairstyle and accessories to match the 1980s. Use authentic period-appropriate styling, warm analogue lighting, subtle film grain, slightly faded colours, soft focus and natural skin texture. Create a believable vintage photograph rather than simply applying an old-photo filter. Remove modern elements such as smartphones, contemporary clothing, modern cars and other present-day objects. Make the final image look like it was genuinely photographed in the 1980s.”

ఒక్క ప్రాంప్ట్‌ తో ఎన్నో లుక్స్!

మొదటి ప్రయత్నంలో వచ్చిన అవుట్ ఫుట్  నచ్చకపోతే అదే ఫోటోతో మళ్లీ మార్పులు చేయవచ్చు. ChatGPT for an 1980s Bollywood studio portrait, a vintage family-album photograph, an old-school wedding portrait, a disco photograph or a retro magazine shoot అని అడగవచ్చు. అయితే, AI రూపొందించిన ఫోటోను షేర్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఫేస్ డీటైల్స్, చేతులు, నగలు, దుస్తుల డిజైన్, బ్యాక్‌గ్రౌండ్‌ లో చిన్నపాటి తప్పులు కనిపించే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. అసలు 80లలో జీవించకపోయినా, ఆ కాలానికి చెందినట్టుగా కనిపించే ఊహాత్మక ఫోటోను ఇప్పుడు AI సాయంతో సృష్టించుకోండి!

Read Also: ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Tags

Related News

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!

మీ ఫోన్‌లోనూ హిడెన్ యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోండి!

మానవ వ్యర్థాలతో.. అత్యంత బలమైన కాంక్రీట్‌.. శాస్త్రవేత్తల నెవర్ బిఫోర్ ప్రయోగం!

జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

Big Stories

Advertisement
×