Nagavamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ(Nagavamsi) త్వరలోనే తన నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic-First Semester) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు సందీప్ రెడ్డివంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలోని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎపిక్ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఇందులో వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ముద్దు సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. ఇలా ఈ ట్రైలర్ లో ఈ ముద్దు సన్నివేశాలను చూపించడంతో చాలామంది ఈ సినిమా అడల్ట్ సినిమా అంటూ జడ్జ్ చేస్తూ డైరెక్టర్ అలాగే నటీనటులపై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ వంశీ ఈ విమర్శలపై స్పందిస్తూ తనదైన శైలిలోనే ఘాటుగా విమర్శలు చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నాగ వంశీ ఈ ఈవెంట్ కి వచ్చిన ఒక ముగ్గురిని పిలిచి ఈ ముద్దు సన్నివేశాల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం నాగ వంశీ మాట్లాడుతూ ముద్దు సీన్ ఉన్నంత మాత్రాన అది అడల్ట్ సినిమా కాదని స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఈ ఎపిక్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే స్వచ్ఛమైన ప్రేమ కథ సినిమా అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల వస్తున్న విమర్శలపై నాగ వంశీ ఘాటుగా స్పందించారు. ఈ కమర్షియల్ సినిమా ద్వారా ఒక ప్రయోగం చేశామని తెలిపారు.2:20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య ఆనంద్ మధ్య సన్నివేశాలు ఏకంగా 1:40 నిమిషాల పాటు ఉంటాయని నాగ వంశీ తెలిపారు.
డైరెక్టర్ ఆదిత్య ఈ సినిమాని చాలా అద్భుతంగా మీ ముందుకు తీసుకురాబోతున్నారని డబ్బున్న అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అంటూ నాగ వంశీ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి సెప్టెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సింది.. వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ జంటగా బేబీ సినిమా తర్వాత నటించిన సినిమా కావడంతో ఎపిక్ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో వేచి చూడాలి.
Also Read: ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య