Public Wi-Fi security risks: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవదు. కానీ.. చాలా మంది చేసే చిన్న పొరపాటు వల్ల పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలామంది ఫోన్‌లోని వై-ఫై ని ఆఫ్ చేయడం మరిచి పోతుంటారు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినప్పటికీ, దీనివెనక ఊహించని భద్రతా ప్రమాదాలు దాగి ఉన్నాయి. హ్యాకర్లు ఈ ఆటో-కనెక్ట్ ఫీచర్‌ను ఆసరాగా చేసుకుని మీ ఫోన్‌లోని డేటాను, పాస్‌వర్డ్‌లను క్షణాల్లో దొంగిలించే అవకాశం ఉంది. ఈ సైబర్ ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మన స్మార్ట్‌ఫోన్‌లు తరచూ కనెక్టివిటీ కోసం వెతుకుతూ ఉంటాయి. వై-ఫై ఆన్‌లో ఉన్నప్పుడు, ఫోన్ తనకు తెలిసిన పాత నెట్‌వర్క్‌ల కోసం సిగ్నల్స్‌ను పంపుతుంది. సైబర్ నేరగాళ్లు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
మనం ఇంటి దగ్గర లేదా ఆఫీస్‌లో వాడే నెట్‌వర్క్‌లను ఫోన్ గుర్తు పెట్టుకుంటుంది. బయటకు వెళ్లినప్పుడు వై-ఫై ఆన్‌లో.. ఉంటే, ఫోన్ నిరంతరం “నేను ఫ్రీ నెట్‌వర్క్ కోసం చూస్తున్నాను” అని సిగ్నల్స్ పంపుతుంది. హ్యాకర్లు ‘ఈవిల్ ట్విన్’ అనే కాన్సెప్ట్‌తో ఒరిజినల్ నెట్‌వర్క్ లాంటి నకిలీ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తారు. మీ ఫోన్ దానిని సురక్షితమైనదిగా భావించి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది.
కనెక్ట్ కాగానే మీ ఫోన్‌లోని సమాచారం హ్యాకర్ సర్వర్‌కి చేరి పోతుంది.
పబ్లిక్ ప్లేసెస్‌లో లేదా ఫ్రీ వై-ఫై నెట్‌వర్క్‌లలో ఈ రకమైన దాడులు ఎక్కువగా జరుగుతాయి. మీరు వై-ఫైకి కనెక్ట్ అయి ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు లేదా బ్యాంకింగ్ యాప్ వాడినప్పుడు, మధ్యలో ఉన్న హ్యాకర్ ఆ డేటాను యాక్సెస్ చేస్తాడు. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ లు కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
వై-ఫై ఆన్ చేసి ఉంచితే మీ ఫోన్ విడుదల చేసే.. ‘మ్యాక్ అడ్రస్’ ఆధారంగా కొన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలు , హ్యాకర్లు మిమ్మల్ని ట్రాక్ చేయెచ్చు. మీరు ఏ సమయానికి ఎక్కడికి వెళ్లారు, ఎంతసేపు ఉన్నారు అనే సమాచారం రికార్డ్ అవుతుంది.ఈ సమాచారాన్ని ఉపయోగించి హ్యాకర్లు మీ పర్సనల్ డేటాకు దుర్వినియోగం చేస్తారు.
సెక్యూరిటీ రీజన్స్ పక్కన పెడితే.. బయట తిరిగేటప్పుడు వై-ఫై ఆన్ ఉంటే సిగ్నల్స్ కోసం వెతికి ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా తగ్గి పోతుంది. దీని వల్ల ప్రాసెస్ హెవీ అయి ఫోన్ వేడెక్కే అవకాశం కూడా ఉంది.
Also Read: ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!
బయటకు వెళ్లగానే.. వై-ఫై ఆఫ్ చేయండి: ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచి బయటకు అడుగుపెట్టగానే.. వై-ఫై ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.
ఆటో కనెక్ట్ డిసేబుల్ చేయండి: మీ ఫోన్ వై-ఫై సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Auto-connect to open networks’ అనే ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి.
వీపీఎన్ ఉపయోగించండి: ఒకవేళ బయట అత్యవసర పరిస్థితిలో.. పబ్లిక్ వై-ఫై వాడాల్సి వస్తే, ఖచ్చితంగా విశ్వసనీయమైన విపిఎన్ వాడండి. ప్రీమియం విపిఎన్ సర్వీసులు ఏడాదికి సుమారు రూ. 1,500 నుంచి రూ. 2,500 వరకు లభిస్తాయి. ఉచిత విపిఎన్ యాప్‌లు ల్యాప్‌టాప్/ఫోన్‌లలో వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
యాంటీవైరస్ సెక్యూరిటీ: మీ స్మార్ట్ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ మొబైల్ సెక్యూరిటీ యాప్స్ వాడొచ్చు. ఇవి మార్కెట్‌లో ఏటా రూ. 500 నుంచి రూ. 1,000 బడ్జెట్‌లో లభిస్తాయి.