KD Song Controversy: ఇటీవల ఓ పాటపై ఎలాంటి కాంట్రవర్సీ (KD Song Controversy) నడిచిందో తెలిసిందే. అందులో ఉన్న బూతులపై అంతటా ఆగ్రహ జ్వాలలు చెలరేగడంతో, వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. అయితే అదే పాటపై చిత్ర దర్శకుడు ఇప్పుడు షాకింగ్‌గా మాట్లాడారు. ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రేమ్. మూవీ పేరు ‘కేడీ: ది డెవిల్’ (KD The Devil). ఈ పాటలో ఉన్న పదాలు చాలా అభ్యంతరకరంగా ఉండటంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇన్‌వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. వెంటనే అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పాటను తొలగించాలని రూల్ పాస్ చేయడంతో.. ఈ పాట, సినిమా బాగా పబ్లిక్‌లో క్రేజ్‌ని సంపాదించుకుంది. నిజంగా ఈ మధ్యకాలంలో ఇలాంటివి జరిగిన ధాఖలాలు అయితే లేనే లేవు. ఏదైనా అభ్యంతర పదం ఉంటే ఆ పదం మార్చాలని మాత్రమే డిమాండ్స్ వచ్చేవి. కానీ, పూర్తి పాటనే లేకుండా చేయాలని అన్నారంటే, అందులో ఎలాంటి పదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Niharika: చరణ్‌కు యాక్సిడెంట్ అని చెప్పగానే షాకైన నిహారిక.. వీడియో వైరల్!
ఇక ఈ పాటను తొలగించడంపై దర్శకుడు ప్రేమ్ (Director Prem) చాలా ఆసక్తికరంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాటకు కన్నడలో లిరిక్స్ రాసింది నేనే. పాన్ ఇండియా సినిమాగా కాబట్టి, 5 భాషల్లో పాటను విడుదల చేశాం. కానీ, హిందీ రాదు. అందుకే ఆ పాటలో ఉన్న లిరిక్స్‌కు నాకు అర్థం తెలియలేదు. ఇంకా ఇంకా ఈ పాట గురించి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల డౌన్ చేశారు కదా. ఇంకా ఎందుకు చర్చలు? దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. యుద్ధం జరుగుతోంది. గ్యాస్ లాంటివి దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటి గురించి చర్చలు పెట్టుకుందాం. ఈ పాటని కావాలనే డిలీట్ చేయించారని నేను అనుకోవడం లేదు. అలాంటి వార్తలను నేను ఖండిస్తున్నాను. నేను మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్నాను. ఈ పాట కేవలం ఒక పార్టీలో వచ్చే సాంగ్ మాత్రమే. సినిమా అంతా చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ పాట విషయంలో సదరు దర్శకుడు సారీ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read- Harish Shankar: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్.. హద్దు మీరితే అదే చేస్తా!
ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నోరా ఫతేహి, సంజయ్‌దత్ వంటివారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ పాటని డిలీట్ చేయడం, దాని వెనుక ఉన్న కారణమే ఈ సినిమాకు ఎక్కడా లేని ప్రమోషన్స్‌ని చేసి పెడుతోంది. ఈ పాట కాంట్రవర్సీ అవక ముందు ఈ సినిమా పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. పాట తీసేస్తే తీసేశారు కానీ, సినిమాపై భలే క్రేజ్ తీసుకొచ్చిందనేలా చిత్రయూనిట్ అనుకుంటూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఇలాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్. అలా చేయలేదంటే, డైరెక్టర్ కెరీర్‌గా కష్టాల్లో పడినట్టే. చూద్దాం మరి.. ఏప్రిల్ 3న వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో?
Also Read- Lavanya: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య.. అడ్డంగా బుక్కయిందిగా!