E-Paper
Advertisement

Thriller Movie OTT : మసాజ్ చేస్తూ మర్డర్లు చేసే సైకో కిల్లర్… ఉత్కంఠ రేపుతున్న పాకిస్తానీ మూవీ… ఐయండిబిలో 9.4 రేటింగ్

Thriller Movie OTT : మసాజ్ చేస్తూ మర్డర్లు చేసే సైకో కిల్లర్… ఉత్కంఠ రేపుతున్న పాకిస్తానీ మూవీ… ఐయండిబిలో 9.4 రేటింగ్
Advertisement

Thriller Movie OTT : పాకిస్థాన్ లోని రావల్పిండిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఇద్దరు పోలీసులు చేసే పోరాటమే ఈ సినిమా. మసాజ్ చేస్తూ క్లయింట్లను చంపిన ఎజాజ్ అలియాస్ జజ్జీ అనే వ్యక్తి కథతో ఇది తెరకెక్కింది. ఈ సినిమా 1990లలో పాకిస్థాన్‌లోని రావల్పిండిలో కలకలం సృష్టించిన జావేద్ ఇక్బాల్ అనే రియల్ సీరియల్ కిల్లర్ కథను పోలి ఉంటుంది. అతను కూడా ఇలాగే సుమారు 100 మంది దాకా హతమార్చి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాను చాలా తక్కువ ఖర్చుతో, ఎటువంటి భారీ సెట్లు లేకుండా రావల్పిండి వీధుల్లోనే షూట్ చేశారు. అయినప్పటికీ దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం విశేషం.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

హబీబ్ షాజాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాకిస్తానీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘జుజ్జీ'(Jujji). ఈ సినిమా 2024లో జరిగిన గంధార ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకుంది. అలాగే పంజాబ్ పోలీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రశంసలు అందుకుంది. ప్రధాన పాత్రలో (కిల్లర్‌గా) నటించిన ముహమ్మద్ అర్స్లాన్ నటనకు విమర్శకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. పోలీస్ ఆఫీసర్లుగా ముస్తఫా రిజ్వీ, అంజుమ్ హబీబీ నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 21నుంచి అమేజాన్ ప్రైమ్, Tubi లో అందుబాటులో ఉంది. దీనిని చాలా సహజంగా, గెరిల్లా ఫిలిం మేకింగ్ స్టైల్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతానికి ఈ సినిమా తెలుగులో డబ్ కాలేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రావల్పిండి నగరంలోని ‘జుజ్జీ’ అనే వ్యక్తి రోడ్డు పక్కన మసాజ్ చేస్తూ జీవిస్తుంటాడు. అతను చూడటానికి సామాన్యుడిలా కనిపించినా, రాత్రి వేళల్లో ఒంటరిగా దొరికిన అమాయకులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు చేస్తుంటాడు. అయితే నగరంలో వరుసగా జరుగుతున్న ఈ మరణాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తాయి. ఈ కేసును ఛేదించడానికి నవీద్ అనే పోలీస్ ఆఫీసర్, అర్షద్ అనే కానిస్టేబుల్ రంగంలోకి దిగుతారు. వీళ్లిద్దరి ఆలోచనా విధానాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, హంతకుడిని పట్టుకోవాలనే లక్ష్యంతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. నిందితుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడానికి వాళ్ళు నగరంలోని ప్రతి సందునూ గాలిస్తారు. చివరికి ఆ హంతకుడు పోలీసులకు దొరికాడా లేదా ? కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అనే విషయాలతో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది.

Read Also : అందమైన రూపం వెనుక అంతులేని ద్రోహం… నమ్మించి నట్టేట ముంచే నర్సు… గుండె బద్దలయ్యే క్లైమాక్స్

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×